ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దెకిచ్చిన ఇంటిని చూసి... యజమాని షాక్!

ABN, First Publish Date - 2021-08-17T17:44:35+05:30

ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిని అద్దెకు ఇచ్చే యజమానులైతే... తమ ఇంటిని చక్కగా చూసుకోవాలంటూ ఇంటిలో దిగే వారికి పలు కండీషన్లు కూడా పెడుతుంటారు. బ్రిటన్‌లో ఒక ఇంటి యజమానికి ఊహించని చేదు అనుభవం ఎదురయ్యింది.  


అతని ఇంట్లో అద్దెకుండే వ్యక్తి కొన్నాళ్లుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో వారిద్దరి మధ్యా తరచూ గొడవలు జరగుతుండేవి. ఒకరోజు ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తి తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని యజమానికి ఫోన్‌చేసి చెప్పాడు. అలాగే ఇంటిని ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా చెప్పాడు.


వెంటనే యజమాని ఆ ఇంటికి వచ్చి. తలుపుతీసి. లోపలి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. ఆ ఇంటిలో 8 వేలకు మించిన బీరు బాటిళ్లు పడివున్నాయి. బాత్రూమ్ పరిస్థితి చూసి దానిలోపలికి అడుగుపెట్టలేకపోయాడు. ఇక బెడ్రూం, కిచెన్ చెత్తతో నిండిపోయింది. దీంతో విపరీతమైన దుర్ఘందం రాసాగింది. 


అన్ని అల్మరాల్లో ఖాళీ చిప్ప్ ప్యాకెట్లు, బీరు బాటిళ్లు, సగం ఆహారం తిని వదిలేసిన ప్లేట్లు కనిపించాయి. వెంటనే ఆ యజమాని పారిశుద్ధ్య కార్మికుడిని పిలిచాడు. అతను వచ్చి, ఆ ఇంటి పరిస్థితి చూసి, సొమ్మసిల్లి పడిపోయాడు. తరువాత మెల్లగా కోలుకుని, మూడు రోజుల పాటు శ్రమించి, ఇంటిని పరిశుభ్రపరిచాడు. 



Updated Date - 2021-08-17T17:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising