ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరచుకున్న దేవాలయం

ABN, First Publish Date - 2021-02-17T12:59:35+05:30

ఉగ్రవాదుల ప్రాబల్యం వల్ల శ్రీనగర్‌లో మూతపడిన శీతల్‌నాథ్ దేవాలయం 31 ఏళ్ల తర్వాత బసంత్ పంచమి సందర్భంగా తెరుచుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): ఉగ్రవాదుల ప్రాబల్యం వల్ల శ్రీనగర్‌లో మూతపడిన శీతల్‌నాథ్ దేవాలయం 31 ఏళ్ల తర్వాత బసంత్ పంచమి సందర్భంగా తెరుచుకుంది. శ్రీనగర్‌లోని హబ్బా కదల్ ప్రాంతలో ఉన్న శీతల్ నాథ్ దేవాలయాన్ని సుదీర్ఘకాలం తర్వాత తెరచి బసంత్ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. స్థానికంగా ఉన్న ముస్లిముల సహకారంతోనే తాము దేవాలయాన్ని 31 ఏళ్ల తర్వాత పునర్ ప్రారంభించామని భక్తుడు సంతోష్ రజ్దాన్ చెప్పారు. ఉగ్రవాద ప్రాబల్యం వల్ల 31 ఏళ్ల క్రితం శీతల్ నాథ్ దేవాలయాన్ని మూసివేశారు. దేవాలయం సమీపంలో ఉండే హిందువులు సైతం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు. 


స్థానిక ముస్లిములే ముందుకు వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేసి భక్తుల ప్రవేశానికి సిద్ధం చేశారని ఆలయ నిర్వాహకులు రవీందర్ రజ్దాన్ చెప్పారు. ‘‘మన ముస్లిమ్ సోదరులు పూజా సామాగ్రి ఇచ్చారని, దాంతోనే తాము పూజలు చేశాం, బాబా శీతల్ నాథ్ భైరవ్ జయంతి ఉత్సవాలు బసంత్ పంచమి సందర్భంగా నిర్వహించాం’’ అని రజ్దాన్ వివరించారు. ఉగ్రవాదుల ప్రాబల్యం తగ్గడంతో ఆలయాన్ని 31 ఏళ్ల తర్వాత తెరిచారు. 

Updated Date - 2021-02-17T12:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising