ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ కోసం వచ్చిన స్పైడర్ మ్యాన్... కిటికీలో నుంచి టీకా!

ABN, First Publish Date - 2021-08-14T13:27:28+05:30

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమైపోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమైపోతోంది. కరోనా కట్టడికి అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీహార్ లోని ఒక వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీహార్ విపక్ష నేత, లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ షేర్ చేశారు. 


బీహార్‌లోని ఆరోగ్య వ్యవస్థ పనితీరుపై, సీఎం నితీష్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వీడియోలో... వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద... రెండు గోడల మధ్య ఒక వ్యక్తి స్పైడర్ మ్యాన్ తరహాలో నిలుచుని, కిటికీలో నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడం కనిపిస్తుంది. ఆరోగ్య కార్యకర్త కూడా ఆ ‘స్పైడర్ మ్యాన్’కు సహకరించడం విశేషం. ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌లో షేర్‌చేసిన తేజ్ ప్రతాప్... ‘ఇకపై కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం మరింత సులభం‘ అని రాశారు. ఈ వీడియో బీహార్‌లోని వైద్య వ్యవస్థ తీరుతెన్నులను చూపిస్తోంది. వ్యాక్సినేషన్ సెంటర్‌లో జనం ఎక్కువగా ఉండటంతో ఒక వ్యక్తి కిటికీలో నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వ్యాక్సినేషన్ కోసం స్పైడర్ మ్యాన్ వచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-08-14T13:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising