ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gwalior:రైలు కిందపడి బాలుడి ఆత్మహత్య..suicide note‌లో ప్రధాని మోదీకి ఏం రాశారంటే...

ABN, First Publish Date - 2021-10-12T15:35:15+05:30

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలుడు...తన చివరి కోరికను తీర్చాలని సాక్షాత్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూసైడ్ నోట్ రాసిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చివరి కోరిక తీర్చాలని అభ్యర్థన

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలుడు...తన చివరి కోరికను తీర్చాలని సాక్షాత్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూసైడ్ నోట్ రాసిన వింత ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. గ్వాలియర్ నగరంలోని కేన్సర్ ఆసుపత్రి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు 11వతరగతి చదివేవాడు. తాను మంచి డాన్సరును కాలేకపోయాననే ఆవేదనతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించాలనే తన చివరి కోరికను నెరవేర్చమని బాలుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థిస్తూ సూసైడ్ నోట్ ను వదిలిపెట్టాడు.


 ప్రముఖగాయకుడు అరిజిత్ సింగ్ తో పాడించాలని, ఈ వీడియో నృత్యానికి నేపాలీ కళాకారుడు సుశాంత్ ఖత్రి నృత్య దర్శకత్వం వహించాలని కోరుతూ బాలుడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. గ్వాలియర్ లోని రైలు పట్టాలపై బాలుడి మృతదేహంతోపాటు సూసైడ్ నోట్ లభించింది. తన కుటుంబం, స్నేహితులు డాన్స్ నేర్చుకునేందుకు మద్ధతు ఇవ్వకపోవడంతో తాను మంచి డాన్సర్ ను కాలేక పోయానని బాలుడు నోట్ లో పేర్కొన్నాడు. మ్యూజిక్ వీడియో తీయాలనే తన చివరి కోరికను ప్రధాని మోదీ తీర్చాలని కోరుతూ బాలుడు సూసైడ్ నోట్ లో పేర్కొనడం సంచలనం సృష్టించింది. గ్వాలియర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-10-12T15:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising