ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నపత్రంలో ఈ బుడ్డోడి సమాధానాలు మామూలుగా లేవుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

ABN, First Publish Date - 2021-11-08T01:34:00+05:30

ఓ విద్యార్థి.. ప్రశ్నలకు సొంతంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే ఆ సమాధానాలు చూసి టీచర్ కూడా షాక్ అయ్యాడు. అతని క్రియేటివిటీకి సంతోషించి ఆన్సర్ షీట్‌ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు విద్యార్థులకు చదువు మీద ధ్యాసం ఉండదు. వచ్చామా, పాఠాలు విన్నామా, సాయంత్రం ఇంటికి వెళ్లామా అనే బాపతు. పాఠశాలలో కూడా అల్లరి చేస్తూ మిగతా విద్యార్థులను కూడా ఆటపట్టిస్తుంటారు. ఒక్కోసారి వారి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. మరోసారి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇక పరీక్షల విషయానికొస్తే.. కాపీలు కొట్టడమో, పక్కన వారి పేపర్‌లో చూసి రాయడమో చేస్తుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఓ విద్యార్థి.. ప్రశ్నలకు సొంతంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే ఆ సమాధానాలు చూసి టీచర్ కూడా షాక్ అయ్యాడు. అతని క్రియేటివిటీకి సంతోషించి ఆన్సర్ షీట్‌ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది.. ప్రశ్నపత్రంలో అతడి సమాధానాలు చూస్తే.. మీరు కూడా నవ్వును ఆపుకోలేరు.


అతడి సమాధానాలు చూసి.. విద్యార్థికి ఫెయిల్ మార్కులు వేసిన టీచర్.. అతడి క్రియేటివిటీకి మాత్రం ఏ గ్రేడ్ ఇచ్చేశాడు. వైరల్ అవుతున్న ఫొటోలో ప్రశ్నలకు విద్యార్థి ఇచ్చిన సమాధానాలు.. లాజిక్‌గా, ఫన్నీగా ఉన్నాయి. చూసిన వారికి వెంటనే నవ్వు తెచ్చించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. వీడు నంబర్ వన్ స్టూడెంట్ అంటూ చమత్కరిస్తున్నారు. ఇంకొందరైతే.. కాఫీలు కొట్టకుండా తనకున్న క్రియేటివిటీని చూపించాడు అంటూ మద్దతిస్తున్నారు. అతడి సమాధానాలు మీరు కూడా చూసి నవ్వుకోండి మరి.


ప్రశ్న: నెపోలియన్ ఏ యుద్ధంలో మరణించాడు?

సమాధానం: అతని చివరి యుద్ధంలో.

ప్రశ్న: స్వాతంత్ర్య ప్రకటనపై ఎక్కడ సంతకం చేయబడింది?

సమాధానం: పేజీ చివరిలో.

ప్రశ్న: రావి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?

సమాధానం: నది ఉన్న రాష్ట్రంలో

ప్రశ్న: విడాకులకు ప్రధాన కారణం ఏమిటి?

సమాధానం: వివాహం.



Updated Date - 2021-11-08T01:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising