ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Video viral: విద్యార్థిని చితకబాదిన మాస్టారు

ABN, First Publish Date - 2021-10-16T00:34:01+05:30

తల్లి, తండ్రి, గురువు, దైవం.. అంటారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత దేవుడికంటే గురువుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతటి విలువైన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తల్లి, తండ్రి, గురువు, దైవం.. అంటారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత దేవుడికంటే గురువుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతటి విలువైన గురువు స్థానానికే కొందరు గురువులు మచ్చ తెచ్చే పనులు చేస్తుంటారు. తమిళనాడులోని ఓ ఉన్నత పాఠశాలలో అలాంటి ఓ గురువు కెమెరా కంటికి చిక్కాడు. ఓ విద్యార్థిని జుట్టుపట్టుకుని కింద పడేసి బెత్తంతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విచక్షణారహితంగా కాళ్లతో తన్నాడు. ఈ వీడియోను తోటి విద్యార్థి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది విపరీతంగా వైరల్ అయింది.


ఈ వీడియోను కాంగ్రెస్ నేత ఎం చిదంబర్ తనయుడు కార్తీ చిదంబరం తన ట్విటర్‌లో షేర్ చేశారు. విద్యార్థులను ఇలా హింసించే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని, ఈ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ట్వీట్‌లో విద్యాశాఖను కోరారు.


కాగా.. చిదంబరం జిల్లాలోని దురై కలియమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న నందనార్ బాలుర పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని కొడుతున్న టీచర్ పేరు సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. పాఠశాలకు సరిగా హాజరు కావడం లేదనే కోపంతో ఏడుగురు 12వ తరగతి ఫిజిక్స్ విద్యార్థులను టీచర్ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.


ఈ ఘటనపై పాఠశాల ఇంచార్జ్, కేర్‌టేకర్ సెల్వ పాండ్యన్ విచారణకు ఆదేశించారు. విచారణఅనంతరం సుబ్రహ్మణ్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



Updated Date - 2021-10-16T00:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising