ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కులో మహిళకు ముద్దుపెట్టిన కానిస్టేబుల్ .. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-16T17:30:54+05:30

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ విచిత్ర పరిస్థితుల్లో సస్పెండ్ అయ్యారు. పట్టణంలోని ఒక పార్కులో మహిళకు ముద్దుపెట్టిన నేపధ్యంలో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన జరిగే సమయంలో సదరు కానిస్టేబుల్ యూనిఫారంలో ఉన్నాడు. ఈ ఘటనపై కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో సదరు కానిస్టేబుల్‌ బాలాజీ(29)ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కోయంబత్తూర్ పట్టణంలో రిజర్వ్ పోలీసు విభాగంలో గ్రేడ్- వన్ కానిస్టేబుల్‌గా 2017 నుంచి బాలాజీ విధులు నిర్వహిస్తున్నారు.


పోలీసు యూనిఫారంలో ఉన్న బాలాజీ పట్టణంలోని వలంకులం పార్కు దగ్గర ఒక మహిళతో మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఆమెకు ముద్దు పెట్టాడు. దీనిని గమనించిన అక్కడున్న కొందరు కుర్రాళ్లు వీడియో తీసి, దానిని కోయంబత్తూర్ పోలీసు అధికారులకు పంపారు. దీనికితోడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో పోలీసు ఉన్నతాధికారులు బాలాజీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ ఇతర మతానికి చెందిన యువతిని వివాహం చేసుకుని, పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. బాలాజీకి ఇటీవలే మరో యువతితో పరిచయమయ్యింది. ఆమెను పార్కులో కలుసుకున్న బాలాజీ ఆమెను ముద్దు పెట్టుకున్నారు.

Updated Date - 2021-11-16T17:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising