ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరపాటున శత్రుదేశానికి లక్షల డాలర్లు పంపిన తాలిబాన్

ABN, First Publish Date - 2021-12-23T06:51:28+05:30

కరువు కారణంగా కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు పొరపాటున లక్షల డాలర్లు శత్రు దేశ రాయబార కార్యాలయానికి పంపించారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో దేశంలో ఆక‌లి, క‌రువు రాజ్య‌మేలుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరువు కారణంగా కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు పొరపాటున లక్షల డాలర్లు శత్రు దేశ రాయబార కార్యాలయానికి పంపించారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో దేశంలో ఆక‌లి, క‌రువు రాజ్య‌మేలుతోంది. త‌న వ‌ద్దనున్న 8 ల‌క్ష‌ల డాల‌ర్లను పొర‌పాటున శ‌త్రుదేశ‌మైన త‌జికిస్తాన్‌లోని రాయ‌బార కార్యాల‌యానికి పంపింది.


జ‌రిగిన త‌ప్పును గుర్తించిన తాలిబానీ అధికారులు.. త‌జికిస్తాన్ రాయ‌బార కార్యాల‌యం అధికారుల‌కు ఆ డ‌బ్బును తిరిగి పంప‌మ‌ని అడిగితే.. వాళ్లు అలా కుద‌ర‌ద‌ని సూటిగా చెప్పేశారు. ఆఫ్ఘ‌నిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీకి మ‌ద్ద‌తుదారు అయిన త‌జికిస్తాన్ ప్ర‌భుత్వం తాలిబాన్ల‌కు వ్య‌తిరేకం.


తాలిబాన్లు ఉగ్ర‌వాదుల‌ని.. అటువంటి ఉగ్ర‌వాదుల బ్యాంకు అకౌంట్ల‌కి డ‌బ్బు పంపించేది లేద‌ని త‌జకిస్తాన్ అధికారులు చెప్పారు. తాలిబాన్ పంపించిన డ‌బ్బును ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌ల‌స వ‌చ్చి త‌జకిస్తాన్‌లో శ‌ర‌ణార్థి శిబిరాల‌లో ఉండే పేద‌ల కోసం ఖ‌ర్చుపెడ‌తామ‌ని వారు తెలిపారు.


ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అక్క‌డ వ్య‌వ‌సాయం చేసుకునే రైతులు కూడా తాలిబాన్ భ‌యంతో వ‌ల‌స వెళ్లిపోయారు. దేశ‌మంతా వ్యాపారాలు లేక ప్ర‌భుత్వం ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. విదేశాలు కూడా అప్పులిచ్చేందుకు నిరాక‌రించాయి. ఇటువంటి ప‌రిస్థితుల‌లో 8 ల‌క్ష‌ల డాల‌ర్లు పోగొట్టుకోవ‌డ‌మంటే మూలిగే నక్క మీద తాటిపండు ప‌డిన‌ట్లే.


Updated Date - 2021-12-23T06:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising