ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ ఒక చిన్నారి కడుపు నింపేందుకు.. మరో చిన్నారిని అమ్మేస్తున్న తల్లిదండ్రులు.. వారి రోదనలు వర్ణనాతీతం!

ABN, First Publish Date - 2021-11-25T16:58:31+05:30

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనకు వంద రోజులు పూర్తయ్యింది. అఫ్ఘానిస్తాన్ పరిస్థితి గతంలో కన్నా మరింత దారుణంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినగా, చాలామంది ప్రజలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లోని ఒక పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి అత్యంత రహస్యంగా మీడియాకు తెలిపింది. తాలిబన్ల పాలనకు వంద రోజులు పూర్తయ్యిందని, ఈ నేపధ్యంలో ఇక్కడి ప్రజల పరిస్థితులు మరింత దిగజారాయన్నారు. ప్రతీ రోజూ యుద్ధవాతావరణాన్ని చూస్తున్నామని వాపోయారు.


యూనివవర్శిటీలో చదువుతున్న తాను తాలిబన్ల అరాచక పాలన కారణంగా మధ్యలోనే చదువు మానేయాల్సివచ్చిందని తెలిపారు. తామంతా ఇళ్లలోనే బందీలుగా ఉంటున్నామని, కనీసం వీధి ముఖం చూసే సాహసం కూడా చేయలేకపోతున్నామన్నారు. దేశంలోని చాలామంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. తాముంటున్న ఈ ప్రాంతంలో చలి తీవ్రంగా ఉంటుందని, ఈ చలిని తట్టుకునే విధంగా సౌకర్యాలు సమకూర్చుకునేందుకు ఇక్కడ ఎవరికీ స్థోమత లేదన్నారు. ఎవరైనా ఆహారం పెడతారేమోననే పరిస్థితుల్లో ఇక్కడివారు కాలం గడుపుతున్నారన్నారు. కొన్ని కుటుంబాల వారు ఆహారం సమకూర్చుకునేందుకు ఇంటిలోని చిన్నారులను అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులు, వారి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమన్నారు. తాను ఇంట్లో విద్యార్థులకు చదువు చెబుతుంటానని, ఈ నేపధ్యంలో చిన్నారులు వారి ఇంటి గురించి చెప్పినప్పుడు ఎంతో బాధకలుగుతుందన్నారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని ఎదురు చూస్తున్నామన్నారు. 


Updated Date - 2021-11-25T16:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising