ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరగతి గదిలో క్లాసు చెబుతున్న టీచర్.. వెనుక నుంచీ వెళ్లి విద్యార్థులు చేసిన పనికి అంతా షాక్.. చివరికి విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2021-12-12T01:52:30+05:30

కర్ణాటకలోని దావణగెరె జిల్లా చిన్నగిరి తాలూకా నల్లూర్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. క్లాసు చెప్పేందుకు ఓ హిందీ టీచర్ తరగతి గదిలోకి వచ్చారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాల్సిన విద్యార్థులు.. అందుకు విరుద్ధంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు పెద్దలు. తల్లితండ్రుల తర్వాత గురువుకు అంత స్థానం ఉంటుంది. ఒకప్పుడు గురువు పట్ల విద్యార్థులకు భయభక్తులు ఉండేవి. క్లాసులోకి ఉపాధ్యాయుడు అడుగుపెడుతున్నాడంటే.. మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యేది. రానురాను ఆ గౌరవం తగ్గిపోతూ వస్తోంది. గురువులకు విలువ ఇవ్వడం అటుంచింతే.. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. క్లాసు రూములోకి వచ్చిన టీచర్‌ పట్ల విద్యార్థులు వ్యవహరించిన తీరు... పలు విమర్శలకు దారి తీసింది. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..


కర్ణాటకలోని దావణగెరె జిల్లా చిన్నగిరి తాలూకా నల్లూర్  హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. క్లాసు చెప్పేందుకు ఓ హిందీ టీచర్ తరగతి గదిలోకి వచ్చారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాల్సిన విద్యార్థులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బోర్డు వద్ద టీచర్ ఉండగా.. వెనుక నుంచి వెళ్లి ఆయన తలపై చెత్త డబ్బా మూశారు. ఇది పద్ధతి కాదంటూ టీచర్ నచ్చజెబుతున్నా లెక్కచేయకుండా మళ్లీ బలవంతంగా తలపై బుట్టను బోర్లించారు. అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ తంతును మొత్తం క్లాసులోని ఓ విద్యార్థి వీడియో తీశాడు.

కళాశాలలో క్లాసు జరుగుతుండగా.. సడన్‌గా లోపలికి వచ్చిన పులి.. ఓ విద్యార్థిపై దాడి.. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ విషయం చివరకు కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ దృష్టికి వెళ్లింది. స్పందించిన మంత్రి.. వెంటనే సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డప్పుల మోతలకు అదిరిపోయే స్టెప్పులు.. వైరల్‌గా మారిన మహిళల డాన్స్ వీడియో



Updated Date - 2021-12-12T01:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising