ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహం, గ్రామసింహం ఫైట్.. ఫలితం చూసి నెటిజన్లు షాక్!

ABN, First Publish Date - 2021-01-10T22:49:41+05:30

సింహం అంటే.. మృగరాజు! అడవి మొత్తానికీ రారాజు. దాని గాండ్రింపు వింటే ఎంత పెద్ద జీవి అయినా వెంటనే ఎలర్టైపోవాల్సిందే. ఎదురుగా వస్తే ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. అటువంటి సింహాన్ని ధైర్యంగా ఎదిరించింది ఓ గ్రామ సింహం! వెనక్కు తగ్గేదే లేదంటూ సింహాపైకి ఎగబడుతూ దానికి గుబులు పుట్టించింది. ఆ స్పీడుకు.. ఆ దూకుడుకు.. అంతటి సింహం కూడా క్షణకాలం పాటు తత్తరపాటుకు లోనైంది. ఎందుకైనా మంచిదని వెనకుడు వేసింది. ఈ పోరాటం తాలూకు దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సింహం అంటే.. మృగరాజు! అడవి మొత్తానికీ రారాజు. దాని గాండ్రింపు వింటే ఎంత పెద్ద జీవి అయినా వెంటనే ఎలర్టైపోవాల్సిందే. ఎదురుగా వస్తే ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. అటువంటి సింహాన్ని ధైర్యంగా ఎదిరించింది ఓ గ్రామ సింహం! వెనక్కు తగ్గేదే లేదంటూ సింహం పైకి ఎగబడుతూ దానికి గుబులు పుట్టించింది. ఆ స్పీడుకు.. ఆ దూకుడుకు.. అంతటి సింహం కూడా క్షణకాలం పాటు తత్తరపాటుకు లోనైంది. ఎందుకైనా మంచిదని వెనకుడు వేసింది. ఈ పోరాటం తాలూకు దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. 


సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోకు వేలల్లో లైకులు, షేర్లు వచ్చిపడుతున్నాయి. వాస్తవానికి ఆ సింహం ఆడదే. మగ సింహం అంతటి పోరాట కాంక్ష లేనిదే..! కానీ అది తలుచుకుంటే కుక్క ప్రాణాలు రెండు క్షణాల్లో గాల్లో కలసిపోయేవీ! కానీ..గ్రామ సింహం దూకుడుతో అసలు సింహం షాకైపోయింది. ముందు జాగ్రత్తగా రెండడుగులు వెనక్కు వేసింది! సహజంగానే..గ్రామ సింహం ధైర్యస్థైర్యాలు చూసి నెటిజన్లూ షాకైపోతున్నారు. గ్రామ సింహానికి జేజేలు పలుకుతున్నారు. ధైర్యం ఉంటే చాలు..కండబలం కాస్త తక్కువైనా నష్టం లేదని చెబుతున్నారు. అయితే...వీరిలో కొందరు మాత్రం తమ డిటెక్టివ్ మెదళ్లను  ఉపయోగించి అసలు విషయం వేరే ఉందని తేల్చి పారేశారు. ఆ ఆడ సింహం ఆకలి మీద ఉండి ఉంటే గ్రామ సింహం ఎప్పుడో ఫలారమైపోయుండేదని ఢంకా బజాయంచి చెబుతున్నారు! అటవీ శాఖ అధికారి పర్వీన్ కాస్వాన్ షేర్ చేసిన ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి! కుక్క విజయానికి కారణమేంటో తేల్చేయండి..!



Updated Date - 2021-01-10T22:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising