ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ లేడీస్ హాస్టల్లో రాత్రయితే చాలు.. రోజూ శబ్ధాలు.. దీంతో ఓ రోజు వారి తల్లిదండ్రులు వచ్చి విచారిస్తే.. ఏం తెలిసిందంటే..

ABN, First Publish Date - 2021-11-20T01:52:46+05:30

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన విచిత్రంగా ఉంది. జిల్లాలోని నాగిరెడ్టిపేట ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వారం రోజులుగా ఈ హాస్టల్లో ఏం జరుగుతోందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలికల వసతి గృహంలో సుమారు 60మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు. అయితే ఆ హాస్టల్లో ఇటీవల రాత్రయితే చాలు.. వింత వింత శబ్ధాలు వస్తుంటాయి. దీంతో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కాలేదు. దీనిపై ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు చేసేదేమీ లేక హాస్టల్ నిర్వాహకులు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తీరా వారు వచ్చి విచారిస్తే.. అసలు విషయం తెలిసింది...


తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన విచిత్రంగా ఉంది. జిల్లాలోని నాగిరెడ్టిపేట ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వారం రోజులుగా ఈ హాస్టల్లో అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. రాత్రయితే చాలా కొన్ని గదుల నుంచి వింత శబ్ధాలు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక.. విద్యార్థినులకు నిద్ర పట్టేది కాదు. ఓ రోజు భయం భయంగానే గది నుంచి బయటికి వచ్చి చూస్తే.. ఎవరో మనిషి తిరుగుతున్నట్లు నీడ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన వారు.. ఉన్నతాధికారులకు తెలియజేశారు.


అయితే దీన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవడంతో విద్యార్థినులు అలాగే భయంభయంగా గడిపేవారు. రోజూ సమస్య ఎక్కువ అవుతుండడంతో హాస్టల్ నిర్వాహకులు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని విచారించగా విషయం తెలిసింది. విద్యార్థినులు భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటామని, అంతవరకు ఇంటికి తీసుకెళ్లమని వారు తెలియజేయడంతో అందరినీ పిలుచుకెళ్లారు. దీంతో హాస్టల్ మొత్తం ఖాళీ అయింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీలత తెలిపారు. ఇదంతా ఆకతాయిలే చేస్తుంటారని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-20T01:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising