ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతిలో బిడ్డతో రాత్రిపూట బస్సు కోసం ఎదురుచూస్తున్న బాలింతకు ఊహించని షాక్.. ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి..

ABN, First Publish Date - 2021-08-02T20:17:06+05:30

ఆమె బాలింత.. చేతిలో 45 రోజుల వయసున్న చిన్నారి.. తల్లి, భర్తతో కలిసి రాత్రిపూట బస్సు కోసం ఎదురుచూస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె బాలింత.. చేతిలో 45 రోజుల వయసున్న చిన్నారి.. తల్లి, భర్తతో కలిసి రాత్రిపూట బస్సు కోసం ఎదురుచూస్తోంది.. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు.. వివరాలు తెలుసుకున్నాడు.. కేవలం వారి కోసం అప్పటికప్పుడు ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి వారిని ఇంటికి చేర్చాడు.. కర్నాటకలోని ముద్దేబిహాల్‌లో ఈ ఘటన జరిగింది. 


నారాయణ్‌పూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ తన 45 రోజుల బిడ్డను హాస్పిటల్‌లో చూపించేందుకు భర్త, తల్లితో కలిసి ఆదివారం ముద్దేబిహాల్‌కు వచ్చింది. హాస్పిటల్‌లో చూపించి మిగిలిన పనులు చూసుకుని బస్ స్టేషన్‌కు చేరుకునే సరికి రాత్రి 9 గంటలైంది. అప్పటికి తమ ఊరుకు వెళ్లే చివరి బస్ వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వారున్నారు. ఆ సమయంలో సామాజిక కార్యకర్త మహాబలేశ్వర్ వారిని గమనించారు. చివరి బస్ వెళ్లిపోయిందని తెలుసుకుని వారిని తన ఇంటికి ఆహ్వానించారు. అయితే అతనింటికి వెళ్లేందుకు వారు నిరాకరించారు. 


దీంతో ఆయన ముద్దేబిహాల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. 45 రోజుల బిడ్డ, బాలింత కోసం ప్రత్యేక బస్ ఏర్పాటు చేయాలని కోరారు. మహాబలేశ్వర్ చెప్పింది విన్న మేనేజర్ రాహుల్ వారి కోసం అప్పటికప్పుడు స్పెషల్ బస్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఛార్జీ వసూలు చేయకుండా అందర్నీ నారాయణ్‌పూర్ చేర్చారు. మానవత్వంతో స్పందించి సహాయం చేసిన మహాబలేశ్వర్, డిపో మేనేజర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2021-08-02T20:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising