ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు ‘శంకర్ దాదా’ ఎంబీబీఎస్ పూర్తి చేశాడోచ్.. ఆ కాలేజీలో ఇదేకోవలో మరికొందరు.. చేతి వేళ్లు తెగ్గోసుకుని మరీ చదువుతున్నారు..

ABN, First Publish Date - 2021-11-25T16:08:21+05:30

ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక యువకుడు 13 ఏళ్ల తరువాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక యువకుడు 13 ఏళ్ల తరువాత ఎట్టకేలకు ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. అతని ఇంటర్న్‌షిప్ పూర్తయిన నేపధ్యంలో ఇటీవలే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్యునిగా నియమితులయ్యారు. శ్రీనగర్ మెడికల్ కాలేజీ‌లో 2008 బ్యాచ్‌లో ఈ యువకుడు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సు ఐదున్నరేళ్లు ఉంటుంది. అయితే ఈ యువకుడు నిర్దేశిత సమయానికన్నా అధిక సంవత్సరాలు గడిచినప్పటికీ కోర్సు పూర్తి చేయలేకపోయాడు. కోర్సు పూర్తి చేసేందుకు నిర్దేశిత సమయమంటూ లేకపోవడంతో కాలేజీ యాజమాన్యం కూడా అతనిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ఆ యువకుడు ఎట్టకేలకు 2021లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశాడు. కొద్ది నెలల క్రితమే ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసి, ఒక ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు వైద్యునిగా నియమితులయ్యారు.


ఈ నేపధ్యంలో ఈ ఎంబీబీఎస్ వైద్యుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. శ్రీనగర్ మెడికల్ కాలేజీ నుంచి మరో ఇద్దరు యువకులు కూడా దశాబ్ద కాలం గడచిన తరువాత కూడా డాక్టరు కోర్సు చేస్తున్నారు. ఇప్పటికీ వీరు కోర్సు పూర్తి చేయకపోవడం విశేషం. వీరిలో ఒక యువకుడు 2009 బ్యాచ్‌లో అడ్మిషన్ తీసుకోగా, మరొక యువకుడు 2010 బ్యాచ్‌లో అడ్మిషన్ పొందాడు. వీరిద్దరూ ఇంతకాలం గడచినప్పటికీ కోర్సు పూర్తి చేయలేదు. కాగా శ్రీనగర్ మెడికల్ కాలేజీ‌లో 2008, 2009 బ్యాచ్‌లో పలువురు విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్ పొందారనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టగా, 16 మంది విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్ పొందినట్లు తేలడంతో వారిని కాలేజీ నుంచి డీబార్ చేశారు. ఈ దర్యాప్తు నేపధ్యంలో అక్రమంగా అడ్మిషన్ పొందిన ఒకరిద్దరు విద్యార్థులు ఫింగర్ ప్రింట్ పరిశీలిస్తారనే భయంతో తమ వేళ్లను కూడా కట్ చేసుకున్నారు. ఆ సమయంలో మెడికల్ కాలేజీల అడ్మిషన్లు రాష్ట్ర స్థాయిలో జరిగేవి. అప్పట్లో వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ విషయంలోనూ పలు విమర్శలు తలెత్తాయి. అక్షరం ముక్క కూడా రాని వ్యక్తి ఎంబీబీఎస్ పూర్తి చేయడాన్ని ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో వినోదాత్మకంగా చూపించిన విషయం అందరికీ తెలిసిందే!

Updated Date - 2021-11-25T16:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising