ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లాళ్లు పళ్లు తోముకోకపోతే... నోరు ఎలా మారిపోతుందో తెలిస్తే షాకవుతారు!

ABN, First Publish Date - 2021-10-03T17:11:28+05:30

చలికాలంలో చాలామంది స్నానం చేయడం మానేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలంలో చాలామంది స్నానం చేయడం మానేస్తుంటారు. అయితే పళ్లు తోముకోవడం ప్రతిరోజూ అందరూ తప్పనిసరిగా చేస్తారు. అయితే కొంతమంది రోజూ బ్రష్ చేసేందుకు కూడా బద్ధకిస్తుంటారు. ఇటువంటి వారికోసమే ఈ వార్త మోసుకొచ్చాం. ఒకవేళ ఎవరైనా నెల్లాళ్లపాటు బ్రష్ చేయకపోతే వారి దంతాల పరిస్థితి ఏమవుతుంది? నెల్లాళ్ల పాటు బ్రష్ చేసుకోకపోతే ముందుగా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీనితోపాట దంతాలకు ఎంతో హాని జరగడం ప్రారంభమవుతుంది. దంతాలపై అపరిమితంగా గార చేరిపోతుంది. పంటిపై తెల్లని రంగు మొత్తం పోతుంది. 


ఇటువంటి స్థితిలో వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాల్సివుంటుంది. నెల్లాళ్ల పాటు పళ్లను తోముకోకపోతే నోటిలోకి విపరీతంగా బ్యాక్టీరియా చేరుతుంది. దంతాలు రోజూ శుభ్రపరుచుకున్నప్పుడు 700 రకాలకు చెందిన 60 లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి. అదే నెల్లాళ్ల పాటు బ్రష్ చేసుకోకపోతే ఏకంగా అవి పదింతలు పెరుగుతాయి. ఈ బ్యాక్టీరియాలు దంతాలపై కేవిటీలను పెంచడమే కాకుండా  చిగుళ్లను మరింత బలహీనపరుస్తాయి. ఫలితంగా ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఆహారం నోట్లో పెట్టకున్నా పళ్లు జివ్వుమని లాగుతాయి. దంతాల నుంచి రక్తం కారుతుంది. అప్పుడు నోటి నుంచే కాకుండా శ్వాస నుంచి కూడా దుర్వాసన వస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మీ నోటిలోని బ్యాక్టీరియా వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా పళ్లు ఊడిపడిపోతాయి. నెల్లాళ్లు బ్రష్ చేయకపోతే ఎన్ని అనర్థాలు ఉంటాయో తెలుసుకున్నారుగా... అందుకే ఇక రోజూ బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.

Updated Date - 2021-10-03T17:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising