ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Solar Storm : ముంచుకొస్తున్న సౌర తుపాను

ABN, First Publish Date - 2021-07-11T14:34:38+05:30

శక్తిమంతమైన సౌర తుపాను భూమివైపు అత్యంత వేగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : శక్తిమంతమైన సౌర తుపాను భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తుపాను ఆదివారం లేదా సోమవారం భూమి అయస్కాంత క్షేత్రం ప్రాబల్యంగల అంతరిక్ష ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఇది సూర్యుని వాతావరణంలో ఏర్పడింది. ఈ వివరాలను Spaceweather.com వెల్లడించింది. 


ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ప్రాంతాల్లో నివసించేవారికి ఈ సౌర తుపాను ఖగోళంలో అందమైన, ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన కాంతిగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండేవారికి ఇది రాత్రి వేళ మేరుజ్యోతి (అరోరా)గా కనిపిస్తుంది. 


అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపిన వివరాల ప్రకారం, గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌర తుపాను దూసుకొస్తోంది. ఈ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. సౌర తుపానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలుగుతుంది. 


Spaceweather.com వెల్లడించిన వివరాల ప్రకారం, సౌర తుపానుల కారణంగా భూమి వాతావరణం వేడెక్కవచ్చు. ఫలితంగా ఉపగ్రహాలపై నేరుగా ప్రభావం పడవచ్చు. జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీలపై ప్రభావం పడవచ్చు. విద్యుత్తు తీగెల్లో విద్యుత్తు ప్రవాహం అధికం కావచ్చు. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవచ్చు. 


Updated Date - 2021-07-11T14:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising