ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పడుకుంటున్నారా? అయితే ఆ ప్రాణాంతక ముప్పు తప్పుతుంది.. తేల్చిచెప్పిన పరిశోధకులు!

ABN, First Publish Date - 2021-11-22T14:49:37+05:30

మీరు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పడుకుంటున్నారా? అయితే ఆ ప్రాణాంతక ముప్పు తప్పుతుంది.. తేల్చిచెప్పిన పరిశోధకులు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే, రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రిపోవాలి. శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని 'గోల్డెన్ అవర్' అని పిలుస్తుంటారు. ఒక వ్యక్తి నిద్రపోయే సమయానికి, గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని వారు గుర్తించారు. ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలలో ఈ అంశాన్ని కనుగొన్నారు. అర్ధరాత్రి లేదా చాలా ఆలస్యంగా నిద్రపోయేవారు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మనిషి నిద్రకు.. గుండె జబ్బులకు సంబంధం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆలస్యంగా నిద్రించే వారు ఉదయం లేటుగా మేల్కొంటారు. ఫలితంగా వారి శరీర గడియారం అస్తవ్యస్తమైపోయి, గుండెపై చెడు ప్రభావం చూపిస్తుంది. దీని ప్రకారం చూస్తే రాత్రిపూట త్వరగా నిద్రపోవడం ద్వారా వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. ఈ ప్రయోగాల కోసం పరిశోధకులు 43 నుంచి 74 ఏళ్ల మధ్య వయసుగల 88 వేలమందని ఎన్నుకున్నారు. వారు నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాలను పరిశీలించారు. అలాగే వారిని.. జీవనశైలికి సంబంధించిన ప్రశ్నలు అడిగి, వాటికి సమాధానాలు తెలుసుకున్నారు. వారిలో గుండె జబ్బులు, పక్షవాతం మొదలైన అంశాలకు సంబంధించిన 5 సంవత్సరాల రికార్డులను పరిశీలించారు. 


ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రతిరోజూ రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పడుకునేవారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయని పరిశోధనలలో వెల్లడయ్యింది. అర్ధరాత్రి తర్వాత నిద్రపోయేవారు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పును ఎదుర్కొంటున్నారని తేలింది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. దీనిలో.. త్వరగా నిద్రపోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ ప్లేన్స్ మాట్లాడుతూ శరీరంలో సక్రమంగా పనిచేసే 24 గంటల అంతర్గత గడియారం మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. దీనిని సిర్కాడియన్ రిథమ్ అని అంటారని, ఆలస్యంగా నిద్రపోవడం వలన సిర్కాడియన్ రిథమ్ మరింత దిగజారుతుందన్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అందుకే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తెలిపారు. 

Updated Date - 2021-11-22T14:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising