ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి.. ఎందుకుంటే..

ABN, First Publish Date - 2021-10-02T20:15:35+05:30

నలుగురితో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కరోనా పుణ్యమా అని ఇంటికే పరిమితం అయ్యారు. ఆన్‌లైన్ పాఠాల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్‌లను పెట్టాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు పిల్లలు.. స్మార్ట్ ఫోన్‌లలోనే వినోదాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నలుగురితో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కరోనా పుణ్యమా అని ఇంటికే పరిమితం అయ్యారు. ఆన్‌లైన్ పాఠాల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్‌లను పెట్టాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు పిల్లలు.. స్మార్ట్ ఫోన్‌లలోనే వినోదాన్ని వెతుకుంటూ.. వాటికి బానిసలైపోయారు. ఈ కోవకే చెందిన ఓ చిన్నారి.. తన తల్లితండ్రులను కొన్ని గంటల వరకు టెన్షన్ పెట్టింది. ప్రాణాల మీదకు తెచ్చుకుని.. ఆందోళనకు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..



కరోనా విజృంభిస్తుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా కోరాయి. పాఠశాలలు కూడా మూతపడటంతో పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.  కాగా.. తమ పని డిస్ట్రబ్ కాకుడదని భావించారో లేక ఆన్‌లైన్ క్లాసుల కోసమో సరైన కారణం తెలియదు కానీ ఇంగ్లాండ్‌కు చెందిన ఓ జంట తమ 6ఏళ్ల కూతురుకి చేతికి స్మార్ట్ ‌ఫోన్ ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి టిక్‌టాక్‌లో వీడియో చూస్తూ.. ఫోన్‌కు బానిసైపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా ఆ బుడ్డది.. సుమారు 23 అయస్కాంతాలను అమాంతం మింగేసింది. తిడతారన్న భయంతో తల్లిదండ్రుల వద్ద విషయాన్ని దాచింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపునొప్పితో బాధపుతూనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది.


దీంతో ఆ తల్లిదండ్రులు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఆ చిన్నారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాప కడుపులో అయస్కాంతలు ఉన్నట్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసి.. అయస్కాంతాలను తొలగించారు. అనంతరం ఆ దంపతులతో మాట్లాడిన డాక్టర్.. సరైన సమయానికి పాపను ఆసుపత్రికి తీసుకొచ్చారని లేకుంటే పరిస్థితి దిగజారేదని పేర్కొన్నాడు. పిల్లలను కనిపెట్టుకుని ఉండాలంటూ వారికి సూచించాడు. 


Updated Date - 2021-10-02T20:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising