ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వ్యాక్సిన్లు ఒక్క డోస్ అయినా చాలట!

ABN, First Publish Date - 2021-04-24T16:26:46+05:30

ఆక్స్‌ఫర్డ్, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్స్‌ఫర్డ్, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఆయా టీకాలను ఒక్క డోస్ పొందినా ఇన్ఫెక్షన్ ముప్పు 65 శాతం మేర తగ్గుతోందని బ్రిటన్‌లో జరిగిన తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం ఈ టీకాల సింగిల్ డోస్‌తోనే రక్షణ పొందుతున్నారని తెలిపింది. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకవచ్చని, అయితే తీవ్ర దుష్పరిణామాలు, ఆస్పత్రి పాలు కావడం, మరణాలు వంటివి ఉండవని పేర్కొంది. 


ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటస్టిక్స్, ఆక్స్‌ఫర్డ్ విద్యాలయం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు టీకా తీసుకున్న 3.5 లక్షల మంది డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. తొలి డోసు పొందిన 21 రోజుల్లోనే చాలా మందిలో యాంటీ బాడీస్ ఉత్పత్తి జరిగినట్టు తేలింది. వారిలో వ్యాధి లక్షణాలు, వైరల్ లోడ్ తక్కువగా ఉందని బయటపడింది. అన్ని వయసుల వారికీ ఈ టీకాలు రక్షణ కల్పిస్తున్నాయని అధ్యయనకారులు స్పష్టం చేశారు.  

Updated Date - 2021-04-24T16:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising