ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐ ప్రియాంక

ABN, First Publish Date - 2021-03-27T15:19:19+05:30

దేశంలోనే మొట్టమొదటిసారి ఓ మహిళా ఎస్ఐ ఎన్‌కౌంటరులో పాల్గొన్న ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలోనే మొట్టమొదటిసారి ఓ మహిళా ఎస్ఐ ఎన్‌కౌంటరులో పాల్గొన్న ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. 2008వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక తాజాగా ప్రగతి మైదానంలో జరిగిన ఎన్‌కౌంటరులో పాల్గొని, ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐగా పేరు పొందారని ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ శిబేష్ సింగ్ చెప్పారు.ఈ ఎన్‌కౌంటరు అనంతరం గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేశారు. 


ఈ ఎన్‌కౌంటరులో రోహిత్ చౌదరి, టిటూల కాళ్లకు గాయాలవడంతో వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించామని మహిళా ఎస్ఐ ప్రియాంక చెప్పారు. ఎన్‌కౌంటరులో గ్యాంగ్ స్టర్లు మహిళా ఎస్ఐ ప్రియాంకపై కాల్పులు జరపగా, అది ఆమె బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలింది. ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐ ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేసిన గ్యాంగ్ స్టర్లకు రూ.5లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-03-27T15:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising