ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి వెళ్లాలంటే ఆ రూల్స్ అన్నీ పాటించాల్సిందేనట.. పెళ్లికుమార్తె కండీషన్ విని బంధువుల షాక్..!

ABN, First Publish Date - 2021-11-08T00:47:09+05:30

పెళ్లికి బంధువులు రావాలని, అందరినీ ఆప్యాయంగా పలకరించాలని వధూవరులు అనుకుంటూ ఉంటారు. అతిథుల ముందు తమ ఆర్భాటం చూపించేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య సందడి సందడిగా పెళ్లి చేసుకోవాలని వధూవరులకు ఉండడం సహజమే. ఆ ఘటన జీవితాంతం మధుర జ్ఞాపకంగా ఉండాలని అనుకుంటారు. ఇక పెళ్లికి వచ్చిన వారు కూడా.. వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, గిఫ్టులు తదితరాలను సమర్పించి వెళ్తుంటారు. వచ్చిన బంధువులకు ఎవరైనా కండీషన్లు పెడతారా.. లేదు కదా. కానీ విచిత్రంగా ఓ వధువు మాత్రం.. పెళ్లికి వచ్చే అతిథులకు చాలా కండీషన్లే పెట్టింది. ఇది విని అంతా షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళ్లితే..


పెళ్లికి బంధువులు రావాలని, అందరినీ ఆప్యాయంగా పలకరించాలని వధూవరులు అనుకుంటూ ఉంటారు. అతిథుల ముందు తమ ఆర్భాటం చూపించేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టుంది. అతిథుల కోసం పెద్ద కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. అయితే వచ్చే వారంతా ఎవరి ఖర్చులు వారే భరించాలని కండీషన్ పెట్టిందట. అంతటితో ఆగకుండా మేకప్‌ ఖర్చులన్నీ బంధువులే భరించాలని ముందుగానే చెప్పిందట. అలాగే భోజనం తదితర ఖర్చులన్నీ వచ్చిన వారే చూసుకోవాలని కండీషన్ పెట్టింది. తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనని తెగేసి చెప్పిందట. దీంతో వచ్చిన వారంతా.. ఈమెక్కడి పెళ్లికూతురురా.. నాయనా.. అనుకున్నారు.


కొందరైతే వివాహానికి రాకుండా ముందే తప్పుకొన్నారట. ఇలాంటి కండీషన్ ఎక్కడా చూడలేదంటూ ముక్కున వేలేసుకున్నారు. మరికొందరైతే వధువుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభమా అంటూ పెళ్లిచేసుకుంటూ.. ఇలాంటి పిచ్చి పిచ్చి కండీషన్లు పెట్టడం ఏంటో అని విసుక్కున్నారు. చాలా మంది రాకపోవడంతో పెళ్లిమండపం బోసిపోయి కనిపించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెట్టిజన్లంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-11-08T00:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising