ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకలవుతోందని అడుక్కుంటుంటే.. పడుకుంటావా అని అడిగేవాళ్లు.. ఈమె నవ్వు వెనుక ఎన్ని కష్టాలో..!

ABN, First Publish Date - 2021-06-24T22:15:46+05:30

చెన్నైకి చెందిన 38 ఏళ్ల గృహిణి శాంతికి మహానగరంలో ఒక ఇల్లు ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నైకి చెందిన 38 ఏళ్ల గృహిణి శాంతికి మహానగరంలో ఒక ఇల్లు ఉంది.. రైల్వేస్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా ఉద్యోగం ఉంది.. కూతురితో కలిసి ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది.. అయితే ఒకప్పుడు ఆమె అష్టకష్టాలు పడింది.. ఆకలి తీర్చుకోవడానికి రోడ్డు పక్కన అడుక్కునేది. రాత్రి పూట రోడ్డు పక్కన పేవ్‌మెంట్ల మీద పడుక్కునేది. 


`నాకు అప్పట్లో ఒక చీర మాత్రమే ఉండేది. దానినే ఉతక్కుని వేసుకునేదాన్ని. రాత్రిపూట గొనె సంచి కప్పుకుని రోడ్ల పక్కన పడుక్కునేవాళ్లం. ఆకలవుతోందని అడుక్కుంటుంటే.. కొంతమంది పడుకుంటావా అని అడిగేవాళ్లు. అలాంటిది ఓ స్వచ్ఛంద సంస్థ వల్ల మా జీవితాలు మారాయి. ఇప్పుడు నేను ఓ ఇంటికి యజమానురాలిని. రైల్వేలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నా. నా కూతురితో కలిసి ప్రశాంతంగా జీవితం గడపుతున్నా. నేనే కాదు.. నాతోటి వారు ఎంతో మంది జీవితాలు మారాయ`ని శాంతి చెప్పింది. 


రోడ్ల పక్కన నివసించే వారి కోసం `ఈక్వితాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్` ఏర్పాటు చేసిన బర్డ్స్ నెస్ట్ కార్యక్రమం కింద శాంతి లాంటి వారి జీవితాలు మారాయి. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు రోడ్ల పక్కన నివసించే వారిని గుర్తించి అర్హులైన వారికి ఈ విధంగా పునరావాసం కల్పిస్తారు. ఉద్యోగం చూపించడమే కాకుండా.. వారి పిల్లల చదువు ఖర్చును భరిస్తారు. అలాగే ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఇప్పిస్తారు. 2010లో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు 2074 మంది రోడ్ల పక్కన నివసించే వారికి పునరావాసం కల్పించింది.

Updated Date - 2021-06-24T22:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising