ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బార్‌లో బయటపడ్డ సీక్రెట్ సెల్లార్.. లోపలకు వెళ్లి చూస్తే కనిపించిన దృశ్యం చూసి అవాక్కైన పోలీసులు.. ఏసీలు, బెడ్లు..

ABN, First Publish Date - 2021-12-13T22:30:53+05:30

అది ముంబైలోని అంధేరీలో ప్రముఖ బార్.. ప్రతిరోజూ హుషారుగా కళకళలాడుతూ ఉంటుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది ముంబైలోని అంధేరీలో ప్రముఖ బార్.. ప్రతిరోజూ హుషారుగా కళకళలాడుతూ ఉంటుంది.. అక్కడ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బార్ గాళ్స్ ఉంటారని అందరూ చెప్పుకుంటారు.. పోలీసులకు కూడా సమాచారం అంది పలుసార్లు దాడి చేశారు.. ఒక్కసారి కూడా వారు అమ్మాయిలను పట్టుకోలేకపోయారు.. ఈ సారి పకడ్బందీగా స్కెచ్ వేసి రాత్రంతా శ్రమించి విజయం సాధించారు.. ఆ బార్‌లో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలను పట్టుకున్నారు.. 


అమ్మాయిలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బార్ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు చూసి అందరూ అవాక్కవుతున్నారు. బార్ గాళ్స్ కోసం నిర్వాహకులు బేస్‌మెంట్‌లో రహస్యంగా ఓ భారీ గదిని నిర్మించారు. బార్‌లోని ఓ గోడకు అమర్చి ఉన్న అద్దం తీసి ఆ గదిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ డోర్స్‌తో నిర్మించిన ఆ గదిలో ఏసీలు, బెడ్లు ఉన్నాయి. బార్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు 17 మంది అమ్మాయిలను నియమించుకున్నారు. ఎంట్రన్స్‌లోనూ, పార్కింగ్ స్థలంలోనూ సీసీటీవీ కెమేరాలు అమర్చి పోలీసుల రాకపై నిరంతరం నిఘా వేస్తుంటారు. 


పోలీసులు వస్తున్నట్టు సమాచారం అందితే బార్‌లో ఉన్న అమ్మాయిలను వెంటనే బేస్‌మెంట్‌లో ఉన్న రహస్య గదిలోకి పంపించేస్తారు. ఆ రహస్య గది గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఆ గది గోడలను బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. 17 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-13T22:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising