ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో child కొంటె పని చేశాడని ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే...shocking

ABN, First Publish Date - 2021-10-30T15:06:03+05:30

పాఠశాలలో ఓ విద్యార్థి కొంటే పని చేశాడనే కోపంతో ప్రిన్సిపాల్ అతన్ని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): పాఠశాలలో ఓ విద్యార్థి కొంటే పని చేశాడనే కోపంతో ప్రిన్సిపాల్ అతన్ని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. 2వతరగతి చదువుతున్న ఓ బాలుడు పాఠశాలలో కొంటెగా ప్రవర్తించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మ కఠిన శిక్ష విధించాడు. మీర్జాపూర్‌లోని అహ్రారాలోని సద్భావన శిక్షణ సంస్థాన్ జూనియర్ హైస్కూల్ ప్రైవేట్ స్కూలుకు చెందిన 2వతరగతి విద్యార్థి కొంటె పని చేశాడని ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మ అతన్ని పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీశాడు.


 ఇతర విద్యార్థులు చూస్తుండగానే చిన్నారి ఏడుస్తూ క్షమించమని వేడుకోవడంతో ప్రిన్సిపాల్ అతన్ని పైకి లాగాడు. బాలుడిని పది నిమిషాల పాటు తలకిందులుగా పట్టుకున్నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. విద్యార్థిని తల్లకిందులుగా వేలాడదీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 352, 506, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సెక్షన్ల కింద పిల్లల తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.అరెస్టు చేసిన తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ తన చర్యలపై విచారం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-10-30T15:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising