ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు.. జూలై 1 నుంచే అమలు!

ABN, First Publish Date - 2021-06-25T22:17:29+05:30

భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన `స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా` సరికొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన `స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా` సరికొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. క్యాష్ విత్‌డ్రా, చెక్ బుక్‌ల విషయంలో సవరించిన సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎంలతోపాటు మిగిలిన ఏటీఎంల్లో నెలకు నాలుగుసార్లు మాత్రమే డబ్బులను ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై క్యాష్ విత్‌‌డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌‌బీడీ) ఖాతాదారులకు ఈ రూల్స్ వర్తించనున్నాయి.


కొత్త నిబంధనలు ఇవి..


* ఒక నెల‌లో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎమ్‌ల వ‌ద్ద మొత్తం నాలుగు ఉచిత న‌గ‌దు లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు. ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.15+జీఎస్‌టీ వ‌సూలు చేస్తారు. 


* ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎస్‌బీడి ఖాతాదారుల‌కు 10 చెక్ లీవ్స్‌ ఉచితంగా లభిస్తాయి. ఆ త‌రువాత అందించే చెక్కుల‌కు ఛార్జి వ‌సూలు చేస్తుంది. 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.40+జీఎస్‌టీ, 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.75+జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త చెక్‌బుక్ స‌ర్వీస్ ఛార్జీల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్లను మిన‌హాయించారు. 


అత్యవసరంగా చెక్ బుక్ పొందాలనుకుంటే రూ.50తోపాటు అదనంగా జీఎస్టీ కట్టాలి. 

Updated Date - 2021-06-25T22:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising