ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలకు విసిగి... నిరసనగా మెట్రోలో ముద్దులాట!

ABN, First Publish Date - 2021-01-02T12:46:00+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాకిపోయిన నేపధ్యంలో అన్నిచోట్లా లాక్‌డౌన్‌లు విధించడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాకిపోయిన నేపధ్యంలో అన్నిచోట్లా లాక్‌డౌన్‌లు విధించడంతో పాటు పలు నిబంధనలు తప్పనరిగా పాటించాల్సివస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల మధ్య సాన్నిహిత్యానికి అడ్డుగోడ పడినట్లు అయ్యింది. దీనిని వ్యతిరేకించిన రష్యాలోని కొంతమంది జనం కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ మెట్రోలోముద్దులు కురిపించుకున్నారు. రష్యాలోని యెకాటెరిన్బర్గ్ పట్టణంలో నడిచే మెట్రోలో పలు జంటలు కరోనా నిబంధనలు వ్యతిరేకిస్తూ ముద్దుల్లో మునిగిపోయారు.  


ఈ సందర్భంగా వారిలో కొంతమంది మీడియాతో మాట్లాడుతూ... తమకు ఇతరుల మనోభావాలు దెబ్బతీయాలనో లేదా పబ్లిక్ సర్వీస్ కు ఆటంకం కలిగించాలనో ఉద్దేశం లేదన్నారు. చాలామంది మ్యూజీషియన్లు కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తున్నారని, వారికి తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. కరోనా వైరస్ అనేది వివిధ సామూహిక కార్యక్రమాల ద్వారా వ్యాప్తిచెందుతున్నదని చెబుతూ ప్రభుత్వం నైట్ క్లబ్‌లకు, ఈవినింగ్ షోలకు ప్రజల హాజరుపై నిబంధనలు విధించిందన్నారు. అయితే మెట్రోలలో లెక్కకుమించి జనం ప్రయాణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీని వలన ఇన్ఫెక్షన్ ముప్పు అధికంగా ఉంటుందని వారంటున్నారు. కరోనా వైరస్ కారణంగా గత కొంతకాలంగా సాయంత్రం వేళ సంగీత కార్యక్రమాలు జరగడం లేదు. అలాగే నైట్ లైఫ్ సెక్టార్ కూడా మూతపడింది. దీంతో వీటిపై ఆధారపడి బతుకుతున్నవారి జీవితాలు అయోమయంగా మారాయి. అలాగే సాయత్రం వేళ కాస్త సేదదీరుదామనుకున్న ప్రజలకు ఉల్లాసాన్ని అందించే కార్యక్రమాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-02T12:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising