ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాట్ అంటే మీకు ఇష్టమా?.. ఈ వింత చాట్ ఎప్పుడూ చూసుండరు.. కొందరు పారిపోతున్నారు.. మరి మీరు ధైర్యంగా తినగలరా?

ABN, First Publish Date - 2021-10-23T17:03:36+05:30

ప్రపంచంలో కరోనా కాలుమోపినప్పటి నుంచి అందరిలో అంతవరకూ దాగున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో కరోనా కాలుమోపినప్పటి నుంచి అందరిలో అంతవరకూ దాగున్న ఆహార అభిరుచులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో కూర్చున్నవారంతా కొత్తకొత్త డిషెస్ తయారు చేశారు. కొందరు డాల్గొనా కాఫీ తయారు చేస్తే, మరికొందరు చాక్లెట్ మ్యాగీ తయారు చేశారు. ఈ విచిత్రమైన వంటకాలన్నీ కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వంటకం హల్‌చల్ చేస్తోంది. అదే రసగుల్లా చాట్. ఈ అద్భుతమైన స్వీట్‌తో చాట్ ఏమిటా? అని ఆశ్చర్యపోకండి. 




కోల్‌కతాలో షాన్ రసగుల్లా అనగానే అందరికీ నోరూరిపోతుంది. తీయిని రసంలో తేలియాడే రసగుల్లాలను చూసినవారెవరైనా వాటిని నోటిలో వేసుకుని గుటుక్కుమనిపించకుండా ఉండలేరు. ఆ సుతిమెత్తని రసగుల్లా నోటిలోకి మెల్లగా జారిపోతుంటే.. ఆ అద్భుత రుచిని ఆస్వాదించాలే తప్ప వర్ణించలేరు. అలాంటి రసగుల్లాతో ఇప్పుడు చాట్ చేస్తున్నారు. ముందుగా రసగుల్లాను తురిమి దానిపై చింతపండు చట్నీ పోస్తారు. దానిపై పెరుగువేసి సర్వ్ చేస్తున్నారు. అయితే తీయని రసగుల్లాకు చింతపండు చట్నీ కాంబినేషన్.. అని తెలియగానే కొందరు వాంతులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వినూత్న చాట్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక ప్లేట్  చాట్ 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విచిత్రమైన చాట్‌కు సంబంధించిన వీడియోను @KaptanHindostan పేరుతో ఉన్న ట్వట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Updated Date - 2021-10-23T17:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising