ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలల క్రితం పెళ్లి.. వాట్సాప్‌లో కూతురి వీడియోను చూసి నివ్వెరపోయిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-07-26T21:54:27+05:30

ఎంతో ఘనంగా కూతురి పెళ్లి చేసిన తండ్రికి తీరని శోకం మిగిలింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంతో ఘనంగా కూతురి పెళ్లి చేసిన తండ్రికి తీరని శోకం మిగిలింది.. పెళ్లైన మూడు నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. చనిపోయే ముందు ఆమె వాట్సాప్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆ తండ్రి కంట పడింది.. దీంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. తన కూతురి చావుకు గల కారణాన్ని తెలియజేశాడు.. రాజస్తాన్‌లో జరిగిన ఈ ఘటన మానవత్వానికి మచ్చగా నిలిచింది. 


బాగోర్ ప్రాంతానికి చెందిన సునీల్ చౌదరి ఈ ఏడాది ఏప్రిల్ 26న తన కూతురు ప్రియను పండేర్ గ్రామానికి చెందిన ముఖేష్ కుమారుడు విక్రమ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అయితే పెళ్లైన నాటి నుంచే విక్రమ్ కుటుంబం ప్రియకు నరకం చూపించింది. అదనపు కట్నం తీసుకురమ్మని వేధించింది. శారీరకంగా, మానసికంగా హింసించింది. వారు ఆమెను కొట్టడమే కాకుండా ఒకరోజు ఆమె బట్టలన్నీ చించేసి నగ్నంగా నిల్చోబెట్టారు. 


భర్త తండ్రి ముందు అలా నగ్నంగా నిల్చోవాల్సి రావడం ప్రియను కంగదీసింది. దీంతో ప్రియ ఈ నెల 22న విషం తాగేసింది. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ శనివారం మరణించింది. చనిపోయే ముందు అత్తింట తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ వీడియో రూపొందించింది. ఆ వీడియో చూసిన సునీల్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-07-26T21:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising