ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్చర్యకర ఘటన.. జోరువానతోపాటు ఆకాశంలోంచి కింద పడిన వాటిని చూసి అవాక్కైన ప్రజలు.. ఇదెక్కడి వింత అంటూ..

ABN, First Publish Date - 2021-10-19T23:42:18+05:30

వర్షాలు కురిసే సమయంలో సాధారణంగానే అప్పుడప్పుడూ వడగండ్లు పడుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు భారీ ఉరుములు, మెరుపులతో పిడుగులు కూడా పెద్ద మొత్తంలో పడుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అలా జరగలేదు. పిడుగులు, వడగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వర్షాలు కురిసే సమయంలో సాధారణంగానే అప్పుడప్పుడూ వడగండ్లు పడుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు భారీ ఉరుములు, మెరుపులతో పిడుగులు కూడా పెద్ద మొత్తంలో పడుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అలా జరగలేదు. పిడుగులు, వడగండ్లు లేకుండా వచ్చిన జోరువాన.. సోమవారం రోజు ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వానతోపాటు ఆకాశంలోంచి కింద పడిన వాటిని చూసి అక్కడి ప్రజలు అవాక్కయ్యారు. ఇదెక్కడి వింత అంటూ నోరెళ్లబెట్టారు. ఇంతకూ ఏం జరిగిందంటే..



ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వర్షంతోపాటు భారీ మొత్తంలో చేపలు ఆకాశం నుంచి కింద పడ్డాయి. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. వర్షంతోపాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడుతున్నట్లు తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు.. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చేపలను పట్టుకునేందకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు సుమారుగా 50 కిలోల చేపలను సేకరించారు. ఇదిలా ఉంటే.. కొన్ని చేపలు వేరు వేరు రంగులు, పరిమాణాల్లో ఉండటం చూసి కొందరు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాటిని విషపూరితమైన చేపలుగా భావించి.. స్థానికంగా ఉన్న కుంటలు, చేరువుల్లో వదిలేశారు. కాగా.. ఈ ఘటనపై వాతావరణ శాస్త్రవేత్తలు స్పందించారు. నదులు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో తుఫానులు సంభవించినప్పుడు ఇటువంటి ఘటన చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. 




Updated Date - 2021-10-19T23:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising