ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Python: కారుపైకి దూసుకెళ్లి కంగారు పెట్టింది!

ABN, First Publish Date - 2021-07-11T17:14:31+05:30

ఓ కారు వేగంగా దూసుకువెళుతోంది. రోడ్డుపై ఏదో కదులుతున్నట్టు కనపించగానే సడన్‌గా ఆగింది. అదేంటా అని గమనిస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాలపై ఏనుగుల దాడి... పట్టణ వీధుల్లో చిరుతపులుల హల్‌చల్ .. ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో సర్వసాధారణమయ్యాయి. జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే,  రోడ్డుపై పైథాన్ దర్శనమిచ్చి... అందరినీ వణికించింది. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


వివరాల్లోకి వెళితే.. ఓ కారు వేగంగా దూసుకువెళుతోంది. రోడ్డుపై ఏదో కదులుతున్నట్టు కనపించగానే సడన్‌గా ఆగింది. అదేంటా అని గమనిస్తే... అదో పైథాన్. వెంటనే తమ మొబైల్స్ తీసి దాన్ని వీడియో తీయడం మొదలు పెట్టారు. ఆ పైథాన్ బుసలు కొడుతూ... అటుగా వెళ్లే వాహనాలపైకి దూసుకు వెళుతోంది. ఉన్నట్టుండి అది వీడియో తీస్తున్న వారివైపుగా వచ్చింది. కారు కిందకు చేరి కాసేపు టెన్షన్ పెట్టింది. అంతలో అటువైపు వెళ్లేవారు వారిని హెచ్చరించడంతో కారు దిగారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి.. కారు మొత్తం పరిశీలించగా బోనెట్‌లో పైథాన్‌ను చూశాడు. 




దక్షిణాఫ్రికాలోని క్రూజర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-07-11T17:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising