ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిరోడ్డుపై గుడ్లు దొంగతనం చేస్తూ చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో ఇదే!

ABN, First Publish Date - 2021-05-16T00:04:53+05:30

ఓ హెడ్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై కోడిగుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై కోడిగుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసి డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించారు. రాజధాని చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఫతేగఢ్ సాహిబ్ టౌన్‌లో జరిగిందీ ఘటన.


ఆ కానిస్టేబుల్ పేరు ప్రీత్‌పాల్ సింగ్. కోడిగుడ్లను సరఫరా చేసే రిక్షా రోడ్డు పక్కన ఆగి ఉండగా, అక్కడికెళ్లిన కానిస్టేబుల్ నాలుగు గుడ్లను కొట్టేసి ప్యాంటు జేబులో వేసుకున్నాడు. ఆ రిక్షా యజమాని రావడంతో ఎదురుగా వస్తున్న ఓ రిక్షాను ఆపిన కానిస్టేబుల్ అదెక్కి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. 


ఈ వీడియో అటూ ఇటూ తిరిగి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. కానిస్టేబుల్ గుడ్ల చోరీని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ మేరకు పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.  



Updated Date - 2021-05-16T00:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising