ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూలుకు వెళ్లగానే తన గదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కైన హెడ్మాస్టర్.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-07-28T01:46:18+05:30

చాలారోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకోవడంతో ఆ స్కూలుకు పిల్లలు, టీచర్లు అందరూ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చాలారోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకోవడంతో ఆ స్కూలుకు పిల్లలు, టీచర్లు అందరూ చేరుకున్నారు. అయితే పాఠాలు చెప్పుకోవడం మాత్రం వారి వల్ల కాలేదు. ఎందుకంటే వారితోపాటు స్కూలుకు వచ్చిన ఓ కోతుల గుంపు.. బడి ప్రాంగణంలో రగడ చేయడం ప్రారంభించాయి. గుంపులోని కొన్ని కోతిపిల్లలు స్కూలు ప్రిన్సిపాల్ గదిలో గొడవ చేయడం ప్రారంభించాయి. వీటి ధాటికి భయపడిన ప్రిన్సిపాల్.. తన గదిలో నుంచి బయటకు పారిపోయాడు. దీంతో ఆయన కుర్చీని చిన్నకోతులు ఆక్రమించేశాయి. అంతేకాకుండా స్కూల్లో పాఠాలు చెప్పడానికి ప్రయత్నించిన కొందరు టీచర్ల మెడలపై కూర్చొని గంతులు వేస్తూ అల్లరి చేశాయి.


మధ్యప్రదేశ్‌లో తాజాగా స్కూళ్లు తెరుచుకున్నాయి. 11, 12వ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్‌లోని ప్రభుత్వ బాలల పాఠశాలకు విద్యార్థులు, టీచర్లు చేరుకున్నారు. వీరితోపాటు ఒక పెద్ద కోతుల గుంపు కూడా ఇక్కడకు వచ్చేసింది. చిన్న కోతులు నానా అల్లరీ చేస్తుండగా.. గుంపులోని కొన్ని పెద్ద కోతులు మరింత క్రూరంగా ప్రవర్తించాయి. తరగతి గదుల వద్ద కూర్చొని లోపలకు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వాటిని తరమడానికి ప్రయత్నించిన ఇద్దరిని కొరికి గాయపరిచాయి కూడా. చివరకు అటవీశాఖకు ఫోన్ చేయాలని కూడా ఆ స్కూలు ప్రిన్సిపాల్ అనుకున్నారు. అయితే కొందరు టీచర్లు, స్టూడెంట్లు ధైర్యం చేసి ఎలాగోలా ఈ కోతుల గుంపును తరిమేశారు. ఈ కోతుల గుంపు చాలా చోట్ల ఇలాంటి రగడ చేసిందని, జన్‌పథ్ ఆఫీసులో కూడా ఇలాంటి హంగామానే సృష్టించిందని స్థానికులు చెప్తున్నారు. 



Updated Date - 2021-07-28T01:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising