ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే పనిగా ఇంటి ముందు అరుస్తోందని గర్భవతి అని కూడా చూడకుండా ఓ శునకంపై దాడి.. చివరకు..

ABN, First Publish Date - 2021-09-15T18:35:59+05:30

ఇంటి ముందు అదే పనిగా అరుస్తోందని ఓ కుక్కపై కర్కశంగా దాడి చేశారు కొందరు యువకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి ముందు అదే పనిగా అరుస్తోందని ఓ కుక్కపై కర్కశంగా దాడి చేశారు కొందరు యువకులు.. గర్భవతి అని కూడా చూడకుండా దానిని గాయపరిచారు.. బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాది రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో మూగజీవుల హక్కుల కార్యకర్త దానిని ఆస్పత్రికి తరలించారు.. ఆ కుక్కపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

నిద్రమత్తులో బ్రష్‌పై పేస్ట్ పెట్టుకున్న యువతి.. తీరా బ్రష్ చేశాక చూస్తే.. విషాదం!




ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు.. తిరిగి వచ్చాక యువతి తండ్రి, అన్న ఎంత దారుణానికి తెగించారంటే..


వడోదరలోని సలత్‌వాడ ప్రాంతంలో ధ్రువేష్, దిగు రావల్ అనే యువకులు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వారు ఇంట్లో ఉన్న సమయంలో ఓ ఆడకుక్క వారి ఇంటి ముందు నిల్చుని అరవడం మొదలుపెట్టింది. అది ఎంతకీ ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు యువకులు బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని బయటకు వచ్చారు. వారిని చూసిన కుక్క అక్కణ్నుంచి పరిగెత్తింది. అయినా వారు ఊరుకోకుండా దానిని వెంబడించారు. 


రోడ్డుపై కనిపించడంతో దానిపై బేస్‌బాల్ బ్యాట్‌తో విచక్షణారహితంగా దాడి చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా దానిని చితకబాదారు. ఆ శునకం బాధను చూసిన స్థానికులు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌కు ఫోన్ చేశారు. అక్కడకు వచ్చిన యాక్టివిస్ట్ ఆ శునకాన్ని వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించాడు. దాడి చేసిన ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-09-15T18:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising