ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి వేడుకకు నేరుగా వచ్చి.. రూ.2 లక్షల పైనే డబ్బును వధువుకు ఈ పోలీసులు ఎందుకు ఇస్తున్నారంటే..

ABN, First Publish Date - 2021-11-29T22:06:58+05:30

అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకేసారి పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి.. ఒకే కల్యాణమండపంలో ఇద్దరూ వివాహాలకు సిద్ధమయ్యారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకేసారి పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి.. ఒకే కల్యాణమండపంలో ఇద్దరూ వివాహాలకు సిద్ధమయ్యారు.. పెళ్లి ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందు పోలీసులు అక్కడకు వచ్చారు.. వారు వచ్చింది ఆ పెళ్లిళ్లను ఆపడానికి కాదు.. తమ వంతు సహాయం చేయడానికి.. పెళ్లి ఖర్చుల కింద రూ.2 లక్షలు ఇవ్వడమే కాదు.. దగ్గరుండి పెళ్లి కూడా జరిపించారు.. రాజస్థాన్‌లోని కంక్రోలి పోలీసులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. 


కంక్రోలీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మంగీలాల్ కూతుళ్లు మమత, కవితకు ఓకేసారి పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి. ఆదివారం ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. అయితే ఎప్పట్నుంచో కేన్సర్‌తో బాధపడుతున్న మంగీలాల్ గత సోమవారం కన్ను మూశాడు. దీంతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు విషాదభరితంగా మారిపోయింది. అయినా ఈ పెళ్లిళ్లను ఆపకూడదని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నిరాడంబరంగా కల్యాణ మండపంలో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేశారు. 


ఇంతకాలం తమతో పాటు పనిచేసిన సహోద్యోగి మంగీలాల్ కుటుంబానికి అండగా నిలవాలని కంక్రోలీ పోలీసులు భావించారు. అందరూ చందాలు వేసుకుని రూ.2 లక్షలు పోగేసి మంగీలాల్ కుటుంబ సభ్యులకు పెళ్లి ఖర్చుల కింద అందించారు. అంతేకాదు పోలీసులందరూ కలిసి కన్యాదానం కూడా చేశారు. దగ్గరుండి పెళ్లి జరిపించారు. 


Updated Date - 2021-11-29T22:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising