ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నుంచి పారిపోయిన యువతి, విద్యార్థులు.. అందుకోసమే వెళ్తున్నామంటూ లేఖ.. ఇంతకీ విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-10-13T00:47:21+05:30

బెంగళూరులో వింత ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం అవుతున్నా తమ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాలేదే.. అని ఎదురు చూసిన తల్లిదండ్రులు.. చివరకు విషయం తెలిసి షాక్ అయ్యారు. విద్యార్థులు చేసిన పనికి ఆందోళన చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరులో వింత ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం అవుతున్నా తమ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాలేదే.. అని ఎదురు చూసిన తల్లిదండ్రులు.. చివరకు విషయం తెలిసి షాక్ అయ్యారు. విద్యార్థులు చేసిన పనికి ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో ఘటనలో విద్యార్థులతో పాటూ 21 ఏళ్ల యువతి కూడా కనిపించకుండా పోయింది. ఇంతకీ వారు రాసిన లేఖల్లో ఏముంది.. వారు అదృశ్యమవడానికి కారణాలేంటో చూద్దాం.. 


బాగలగుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పరిక్షిత్‌, నందన్‌, కిరణ్‌ అనే ముగ్గురు విద్యార్థులు.. ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వారికి చదువుల కంటే ఆటలపైనే ఆసక్తి. ఇంట్లో మాత్రం చదువుకోమని ఒత్తిడి చేసేవారు. రోజూలాగే శనివారం కూడా పాఠశాలకు వెళ్లారు. అయితే సాయంత్రం మాత్రం ఇంటికి రాలేదు. అంతవరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసుకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు.. వారి ఇళ్లల్లో లెటర్లు కనిపించాయి. అందులో ఇలా రాసి ఉంది.


‘‘మాకు చదువు కంటే ఆటలంటేనే ఇష్టం.. ఎంత ప్రయత్నించినా చదువుకోవాలన్న ఆసక్తి కలగడం లేదు.. ఆటల్లో కష్టపడి, పైకి రావాలని నిర్ణయించుకున్నాం. మంచి పేరుతో పాటూ బాగా డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగొస్తాం. దయచేసి మాకోసం వెతకొద్దు’’.. అని రాసి ఉంది. మరోవైపు వీరి లేఅవుట్‌ సమీపంలోనే మరో కేసులో 21 ఏళ్ల యువతితో పాటు మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. అమృత వర్షిణి(21), రోయన్‌ సిద్ధార్థ్‌(12), చింతన్‌, భూమి తదితరులు ఆదివారం అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరి ఇంట్లో లేఖ లభించింది. ఇంట్లోని క్రీడా వస్తువులు తదితరాలను తీసుకెళ్తున్నట్లు రాశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-10-13T00:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising