ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో పెళ్లనగా రాత్రిపూట ఫంక్షన్ హాల్లోకి పోలీసుల ఎంట్రీ.. నేరుగా వధువు రూమ్ లోకి వెళ్లి..

ABN, First Publish Date - 2021-11-23T11:12:33+05:30

పెళ్లి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అందంగా ముస్తాబైన పెళ్లికొడుకు, పెళ్లికూతురు, విందుభోజనం, బంధువులు, అతిథుల కోలాహలం. ముఖ్యంగా పెళ్లికొడుకు, ఫెళ్లికూతురు.. వీరిద్దరికీ ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. అలాంటిది అనుకోకుండా, అకారణంగా ఎవరైనా ఆ వేడుకకి భంగం కలిగిస్తే అక్కడున్న వారి సంతోషమంతా ఆవిరైపోతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అందంగా ముస్తాబైన పెళ్లికొడుకు, పెళ్లికూతురు, విందుభోజనం, బంధువులు, అతిథుల కోలాహలం. ముఖ్యంగా పెళ్లికొడుకు, ఫెళ్లికూతురు.. వీరిద్దరికీ ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. అలాంటిది అనుకోకుండా, అకారణంగా ఎవరైనా ఆ వేడుకకి భంగం కలిగిస్తే అక్కడున్న వారి సంతోషమంతా ఆవిరైపోతుంది.  


బీహార్‌ రాజధాని పట్నాలో గత ఆదివారం రాత్రి ఒక పెళ్లి జరుగుతుండగా.. అక్కడ అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు. ఆ వేడుకలో ఉన్నవారందరితో అవమానకరంగా మాట్లాడారు. ఆ వివాహ వేడుకలో వాళ్లు సరైన అనుమతి లేకుండానే ప్రవేశించి ఏకంగా పెళ్లికూతురు గదిలో వస్తువులన్నీ తెరిచి చూశారు. ఆ సమయంలో అక్కడ స్త్రీలు బట్టలు మార్చుకుంటున్నారు, పెళ్లికూతురు ముస్తాబు కోసం ఉంచిన నగలు, మేకప్ సామాన్లను కూడా వారు పరిశీలించారు. పెళ్లికి వచ్చిన బంధువుల బ్యాగులన్నీ తెరిచి చూశారు. ఇదంతా అక్కడున్న వారు కొందరు వీడియో తీశారు. 


అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ వేడుకలో ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని అక్కడున్న వారంతా ప్రశ్నించారు. పైగా స్త్రీల గదిలో వెళ్లిన పోలీసులలో ఒక్క మహిళా పోలీసు లేకపోవడం గమనార్హం. పెళ్లికి వచ్చిన బంధువులను సైతం ప్రశ్నించారు. "మీకు మందు తాగే అలవాటు ఉందా?.. మీకు బ్యాగులో విస్కీ, రమ్, బీర్ బాటిళ్లు ఏమైనా ఉన్నాయా?.. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు?" అంటూ పోలీసులు ఆ కళ్యాణ మండపంలో ఉన్నావారందరినీ విచారణ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజెన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.


బీహార్‌లోని ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ఘటనని ఖండించడంతో పోలీసులు వివరణ ఇవ్వ వలిసి వచ్చింది. ఆ పెళ్లిలో పోలీసుల బృందానికి నాయకత్వం వహించిన ఇన్‌స్పెక్టర్ జహింగీర్ ఆలం మాట్లాడుతూ.. "రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది, దీనికి సంబంధించి మాపై చాలా ఒత్తిడి ఉంది. అందుకే మేము కఠినంగా వ్యవహరిస్తున్నాము. ఆ పెళ్లిలో జరగింది కూడా మద్యపాన నిషేధానికి చర్యలలో ఒకభాగమే. వివాహ వేడుకలలో మద్యం సేవించడం ఇక్కడ సాధారణంగా జరుగుతూ ఉండడంతో అలాంటి చోట కూడా మేము విచారణ చేయవలసి వస్తోంది" అని అన్నారు.

Updated Date - 2021-11-23T11:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising