ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చం తెలుగు సినిమాల్లో మాదిరిగానే.. పెళ్లి జరుగుతుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-11-26T03:18:23+05:30

పెళ్లి జరుగుతుండగా.. సడన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి వరుడిని అరెస్ట్ చేసేటువంటి సీన్‌లు మనం సాధారణంగా తెలుగు సినిమాల్లోనే చూస్తూంటాం. అచ్చం ఇటువంటి ఘటనే ప్రస్తుతం ఓ ప్రదేశంలో చోటు చేసుకుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి జరుగుతుండగా.. సడన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి వరుడిని అరెస్ట్ చేసేటువంటి సీన్‌లు మనం సాధారణంగా తెలుగు సినిమాల్లోనే చూస్తూంటాం. అచ్చం ఇటువంటి ఘటనే ప్రస్తుతం ఓ ప్రదేశంలో చోటు చేసుకుంది. సంప్రదాయం ప్రకారం వివాహం జరగుతుండగానే పోలీసులు పెళ్లి కొడుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అవడంతో.. సోషల్ మీడియా వరకూ వెళ్లింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 


దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు చెందిన వ్యక్తి.. ఓ మహిళను చూసి ఇష్టపడ్డాడు. ఆమె అంగీకారంతో పెళ్లికి సిద్ధం అయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతిథుల మధ్య.. ఆమెను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటున్న సమయంలో.. ఆ వివాహ వేదిక వద్దకు సడన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా.. పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి, తీసుకెళ్తున్న సమయంలో నవ వధువు అధికారులకు అడ్డుపడింది. అతడిని తీసుకెళ్లొద్దు అని అభ్యర్థించింది. 



అయితే పోలీసులు ఆమె విన్నపాన్ని పట్టించుకోలేదు. అతడిని జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. సదరు వ్యక్తికి ఇప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. అయితే.. ఆమెకు భరణం ఇవ్వకుండానే.. మరో పెళ్లికి సిద్ధపడ్డాడని పేర్కొన్నారు. సదరు మహిళ తమకు ఫిర్యాదు చేసినందువల్లే.. అతడిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. దీంతో నెట్టింట్లోనూ ఈ విషయం వైరల్ కావడంతో.. నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2021-11-26T03:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising