ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TikTok పిచ్చి ముదిరింది.. ఆపరేషన్‌ను మధ్యలోని వదిలేసి వైద్యుడి వికృత చేష్టలు..!

ABN, First Publish Date - 2021-12-01T22:07:10+05:30

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ మొబైల్‌కు, సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ మొబైల్‌కు, సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. సామన్యులే కాదు.. ఎంతో జ్ఞానవంతులు, ఇతరులకు మంచి చెప్పాల్సిన వైద్యులు కూడా ఇదే బాట పడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ టిక్‌టాక్‌కు బానిసగా మారి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బంగారం లాంటి తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 


ఆస్ట్రేలియాకు చెందిన డానియెల్ అరోనోవ్ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. ప్రతిభావంతుడైన డానియెల్ టిక్‌టాక్ కారణంగా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. డానియెల్‌కి టిక్‌టాక్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. తన ఆపరేషన్లకు సంబంధించిన వీడియోలను డానియెల్ తరచుగా టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు. అంతేకాదు టిక్‌టాక్‌లో వ్యూస్ కోసం రోగుల ఆరోగ్యంతో కూడా ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆపరేషన్లను మధ్యలోనే ఆపేసి టిక్‌టాక్ కోసం డ్యాన్స్ చేసేవాడు. 


టిక్‌టాక్ మీద వ్యామోహంతో ఆపరేషన్లను సకాలంలో పూర్తిగా చేసేవాడు కాదు. ఒకటి చేయబోయి ఇంకోటి చేసేవాడు. దీంతో రోగుల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. విచారణలో డానియెల్ వ్యవహారం మొత్తం బయటపడింది. దీంతో ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ (ఏహెచ్‌పీఆర్‌ఏ) డానియెల్‌పై కొరడా ఝుళిపించింది. ఇకపై అతను ఎలాంటి శస్త్రచికిత్సలను నిర్వహించడానికి వీలు లేదని నిషేధం విధించింది. 

Updated Date - 2021-12-01T22:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising