ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిక్నిక్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆ రెండు కుటుంబాలు ఆ క్షణంలో వణికిపోయాయి.. రాత్రంతా కేకలు పెడుతూనే ఉన్నారు.. ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-08T15:54:16+05:30

సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో పాటు ఆనందంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో పాటు ఆనందంగా విహార యాత్రలకు వెళ్లాలని అందరూ కలలుగంటుంటారు. ఇదేవిధంగా పిక్నిక్‌కు వెళ్లిన ఆ రెండు కుటుంబాలకు తీరని విషాదం ఎదురయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జిల్లాలోని బార్సూర్ సాత్‌ధార్ దగ్గరకు పిక్నిక్ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఇంద్రావతి నదిలో గల్లంతయ్యారు. వీరిద్దరూ దంతేవాడలోని కిరండోల్ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) ఉద్యోగులు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాలు జారడంతో వారిద్దరూ నదిలో పడిపోయారని తెలుస్తోంది. 


సమాచారం అందుకున్న వెంటనే గస్తీ దళాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే రాత్రి చీకటి పడటంతో గల్లంతయినవారి జాడ తెలియలేదు. ఈ ఘటన బార్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎన్ఎండీసీ ఉద్యోగులు ప్రదీప్ దత్తా(50), సంజయ్ రాయ్(45) తమ కుటుంబాలతో పాటు బర్సూత్ సాత్ థార్‌లో పిక్నిక్ చేసుకునేందుకు వెళ్లారు. వంతెన కిందనున్న పిక్నిక్ స్పాట్‌లో భోజనాలు చేశాక, వారంతా ఆనందంగా నదిలో దిగారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద అల వారివైపు వచ్చింది. ఈ సమయంలో నదిలో ఉన్న ప్రదీప్ దత్తా, సంజయ్ రాయ్‌లు పట్టుతప్పి నీటిలో పడిపోయారు. దీనిని గమనించిన వారి కుటుంబ సభ్యులు బాధితులను కాపాడాలని చాలాసేపు కేకలు పెట్టారు. కొద్దిసేపటి తరువాత పోలీసులకు సమాచారం అందడంతో వారు గస్తీ బృందాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాధితుల జాడ తెలియలేదు.



Updated Date - 2021-11-08T15:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising