ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలనులో 12 అడుగుల మొసలి.. సెల్ఫీ కోసం అందులోకి దిగిన వ్యక్తి.. చివరికి..

ABN, First Publish Date - 2021-11-29T02:06:43+05:30

సెల్ఫీ సరదా ఓ వ్యక్తిని ప్రాణాపాయంలోకి నెట్టేసింది. మొసలి నోటి నుంచి తృటిలో తప్పించుకున్న అతడు.. ప్రస్తుతం హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సెల్ఫీ సరదా ఓ వ్యక్తిని ప్రాణాపాయంలోకి నెట్టేసింది. మొసలి నోటి నుంచి తృటిలో తప్పించుకున్న అతడు.. ప్రస్తుతం హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఫిలిప్పీన్స్‌కు చెందిన నెహెమియాస్ చిపాడా(60) అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి తాజాగా కాగయన్ డి ఓరో సిటీలోని ఓ థీమ్ పార్క్‌కు వెళ్లాడు. అనంతరం పార్కును సందర్శిస్తూ.. పార్కులోని నీటి కొలను వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కొలనులో ఉన్న మొసలిని చూసి.. దాన్ని బొమ్మగా భావించాడు. అంతేకాకుండా.. దానిపక్కన నిల్చొని సెల్ఫీ దిగేందుకు కొలనులోకి దిగాడు. చేతిలో ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో.. కొలనులోని మొసలి ఒక్కసారిగా అతడిపై అటాక్ చేసింది. ఎడమచేయి పట్టుకుని లాగింది. దీంతో తొలుత ఒక్కసారిగా భయాందోళను గురైన చిపాడా.. ఆ తర్వాత ఎలాగోలా దాని నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. అనంతరం మొసలి దాడిలో గాయపడ్డ చిపాడాను అతడి కుటుంబ సభ్యులు.. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం చిపాడా ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. 




Updated Date - 2021-11-29T02:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising