ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pet cat Chinu : నాగుపాము బారి నుంచి కుటుంబాన్ని కాపాడింది...

ABN, First Publish Date - 2021-07-22T15:31:20+05:30

కుక్క లాగే పెంపుడు పిల్లి విశ్వాసంతో యజమాని కుటుంబాన్ని నాగుపాము బారినుంచి కాపాడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): కుక్క లాగే పెంపుడు పిల్లి విశ్వాసంతో యజమాని కుటుంబాన్ని నాగుపాము బారినుంచి కాపాడిన వినూత్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని భీమాతంగి ప్రాంతంలోని ఓ ఇంట్లో వెలుగుచూసింది. భీమాతంగి ప్రాంతానికి చెందిన సంపద్ కుమార్ పరిదా కుటుంబం చిను పేరిట ఓ పిల్లిని పెంచుకుంటోంది. చిను అనే పెంపుడు పిల్లి పెరట్లోకి పరుగెత్తడం చూసి యజమాని దాన్ని అనుసరించాడు. పెంపుడు పిల్లి నాలుగు అడుగుల నాగుపాము ఇంటిలోపలకు రాకుండా దానికి అడ్డంగా నిలబడి అడ్డుకుంది.నాగుపాము బుసలు కొడుతూ పడగవిప్పి కాటు వేసేందుకు యత్నిస్తున్నా పెంపుడు పిల్లి ధైర్యంగా నిలబడి పామును అడ్డుకుంది.30 నిమిషాల పాటు పామును ఇంటి లోపలకు రాకుండా పిల్లి అడ్డుకొని యజమాని కుటుంబాన్ని కాపాడింది.


అంతలో సంపద్ సహాయం కోసం స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. దీంతో స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీరు అరుణ్ కుమార్ బరాల్ సంఘటన స్థలానికి వచ్చి నాగుపామును పట్టుకున్నారు. పామును పట్టుకునే దాకా పాము, పిల్లి పోరాటం అరగంటపాటు సాగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని వాలంటీర్ అరుణ్ చెప్పారు. నాగుపామును అడవిలో వదిలేశారు.పెంపుడు పిల్లి యజమాని కుటుంబాన్ని కాపాడిందని వాలంటీర్ చెప్పారు. పెంపుడు జంతువులు తమ యజమాని ప్రాణాలు కాపాడటానికి అవి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడవని స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్ చెప్పారు. 


Updated Date - 2021-07-22T15:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising