ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడుబడ్డ బావిలో చెత్తను పారేసిన వ్యక్తి.. లోపలి నుంచి అదే పనిగా శబ్దం.. ఏంటా అని తొంగి చూస్తే కనిపించిన సీన్ చూసి..

ABN, First Publish Date - 2021-11-11T02:04:43+05:30

ఒడిశాలో ఓ పురతాన బావి, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వ్యక్తి చెత్తను పడేసేందుకు బావి దగ్గరకు వెళ్లాడు. చెత్త సంచిని అందులో వేసి వెళ్తుండగా.. లోపలి నుంచి శబ్ధాలు రావడం మొదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లెల్లో గతంలో బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అవన్నీ పాడుబడ్డ బావుల్లా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో వాటిని పూడ్చేస్తుంటారు. కొన్నిచోట్ల మాత్రం పాడుబడిన బావులు దర్శనమిస్తూ ఉంటాయి. విషయం ఏంటంటే.. ఒడిశాలో ఓ పురతాన బావి, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వ్యక్తి చెత్తను పడేసేందుకు బావి దగ్గరకు వెళ్లాడు. చెత్త సంచిని అందులో వేసి వెళ్తుండగా.. లోపలి నుంచి శబ్ధాలు రావడం మొదలయ్యాయి. ఎండుటాకులపై ఎవరో నడుస్తున్నట్లు వినిపించింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆ వ్యక్తి.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని, అక్కడేముందో చూసే ప్రయత్నం చేశాడు.


ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తనంతా పాడుబడిన బావిలో వేస్తుంటారు. అలాగే ఓ రోజు గ్రామస్తుడు చెత్తను వేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కంగారుపడిన ఆ వ్యక్తి.. లోపల మనిషి పడిపోయాడోమో అనుకుని చూసేందుకు వెళ్లాడు. అయితే బావిలో మనిషికి బదులుగా.. 12 అడుగుల కింగ్‌కోబ్రా చిక్కుకుపోయి కనిపించింది. విషయం తెలుసుకుని గ్రామస్తులంతా అక్కడికి వచ్చారు. పామును పట్టుకునేందుకు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. అతి కష్టం మీద దాన్ని బావిలోంచి బయటకు తీశారు. అనంతరం దానికి పరీక్షలు నిర్వహించి, అడవిలో వదిలిపెట్టారు. కింగ్‌కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ పాములు దాదాపు 22అడుగుల వరకు పెరుగుతుంటాయి.

Updated Date - 2021-11-11T02:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising