ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shoking news: ఆ దేశంలో మరో కొత్త వ్యాధి.. ఇప్పటికే ఆరుగురు మృతి.. ఆందోళనలో ప్రజలు..

ABN, First Publish Date - 2021-10-10T03:09:21+05:30

మెదడుకు సంబంధించిన వింత వ్యాధితో ఆ దేశంలో పలువురు మృత్యువాత పడుతున్నారట. మతిమరుపు, ఒత్తిడి, కండరాల నొప్పులు తదితర కారణాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ అంతుచిక్కని రోగం బయటపడితే ఎలా ఉంటుంది. అందులోనూ ప్రాణాలు తీసే రోగమైతే.. ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెదడుకు సంబంధించిన వింత వ్యాధితో ఆ దేశంలో పలువురు మృత్యువాత పడుతున్నారట. మతిమరుపు, ఒత్తిడి, కండరాల నొప్పులు తదితర కారణాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. ఈ వ్యాధి ఏంటో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదట. వివరాల్లోకి వెళితే.. పరిశోధన


కెనడాలోని బ్రన్‌స్విక్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఓ వింత వ్యాధి వెలుగు చూసింది. మెదడుకు సంబంధించిన ఈ వింత వ్యాధితో ఇప్పటికే ఆరుగురు మరణించారు. మొత్తం 48 మందికి ఈ వ్యాధి సోకినట్లు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారంతా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారట. మరణాలు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రోగులను విచారిస్తున్నారు. వ్యాధి లక్షణాలపై ఆరాతీస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. 18 నుంచి 85 ఏళ్ల మధ్య వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.


రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తద్వారా వ్యాధి మూలాలను కనుక్కోవడంలో వైద్యులు నిమగ్నమయ్యారు. ఒకే టీవీ షోకు అడిక్ట్ అయిన ఓ బాలికకు కూడా ఇటీవల ఈ వ్యాధి సోకిందట. పదే పదే అదే షో చూడాలనే భావన.. బాలికలో  కలుగుతోందని వైద్యులు గుర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ కొందరు నరాల సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. ప్రస్తుతం మళ్లీ కొత్త వ్యాధి రావడంతో కెనడా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-10-10T03:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising