ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరె.. అచ్చం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లా ఉన్నాడే!

ABN, First Publish Date - 2021-10-15T17:34:56+05:30

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి నడిపిస్తున్న చాట్ దుకాణానికి జనం క్యూ కడుతున్నారట. ఎందుకంటే ఆ దుకాణం నడిపిస్తుంది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వస్త్ర దుకాణాలు, హోటళ్ల ప్రారంభోత్సవానికి సెలబ్రిటీలను పిలుస్తూ ఉంటారు. తమ వ్యాపారం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అయితే సెలబ్రిటీలే స్వయంగా వ్యాపారాలు నడిపితే.. ఇక వారి వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా ఉంటుంది కదా. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పున్నారు అనుకుంటున్నారా.. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి నడిపిస్తున్న చాట్ దుకాణానికి జనం క్యూ కడుతున్నారట. ఎందుకంటే ఆ దుకాణం నడిపిస్తుంది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. సీఎం ఏంటి, చాట్ బండి పెట్టడమేంటి అని అనుకుంటున్నారు కదా. అక్కడికి వెళ్లే ముందు అంతా అలాగే అనుకుంటారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. అరే అచ్చం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా ఉన్నారే, ఇది నిజమా లేక భ్రమా అని అంటారు. వివరాల్లోకి వెళితే.. 


మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ్వాలియ‌ర్‌లోని ఫూల్ బాగ్ ఏరియాలో మోతీ మ‌హ‌ల్ ముందు గుప్తా చాట్ పేరుతో ఓ వ్యక్తి స్టాల్‌ను నిర్వ‌హిస్తున్నాడు. అతడి వ్యాపారానికి విపరీతమైన గిరాకీ ఉంది. అతను అచ్చం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ మాదిరి ఉండడంతో చాలా మంది అతన్ని చూడటానికి అక్కడికి వస్తుంటారు. అందులోనూ అతడి చాట్, స్వీట్లు రుచికరంగా ఉండడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట. వచ్చిన వారంతా పనిలోపనిగా అతడితో సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అతను సెలబ్రిటీ అయిపోయాడు. ఇటీవల ఓ య్యూటూబర్.. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 



Updated Date - 2021-10-15T17:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising