ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో Pakistani woman ప్రసవం...మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు

ABN, First Publish Date - 2021-12-06T13:18:27+05:30

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అట్టారీ సరిహద్దుల్లో ఓ పాకిస్థానీ మహిళ ప్రసవించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్టారీ సరిహద్దు: భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అట్టారీ సరిహద్దుల్లో ఓ పాకిస్థానీ మహిళ ప్రసవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన తల్లిదండ్రులు నింబు బాయి, బాలం రామ్‌లు ఇండో-పాక్ సరిహద్దులో ఉండగా, ప్రసవం జరిగి వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దేశ సరిహద్దుల్లో మగబిడ్డ పుట్టినందున బాబుకు బోర్డర్ అని పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు నింబుబాయి,బాలంరామ్‌లు చెప్పారు.తల్లిదండ్రులు నింబు బాయి, బాలం రామ్‌లు 97 మంది పాకిస్థానీ పౌరులతో కలిసి గత 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు.నింబు బాయి నిండు గర్భవతి కావడంతో డిసెంబర్ 2 న ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 


నింబు బాయి ప్రసవానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుంచి కొంతమంది మహిళలు వచ్చి సహకారమందించారు. లాక్‌డౌన్‌కు ముందు పాకిస్థాన్ పౌరులు వారి బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారతదేశానికి 98 మంది ఇతర పౌరులతో కలిసి వచ్చారు.తమ వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో పాక్ దేశంలోని తమ ఇంటికి తిరిగి రాలేకపోయానని బాలం రామ్ చెప్పారు.సరిహద్దుల్లో 47 మంది పిల్లలున్నారు. వారిలో ఆరుగురు భారతదేశంలో చిక్కుకున్నపు్పడే జన్మించారు.బాలమ్ రామ్‌తో పాటు, అదే డేరాలో నివసిస్తున్న మరో పాకిస్థానీ పౌరుడు లగ్య రామ్ కూడా 2020లో జోధ్‌పూర్‌లో పండంటి బిడ్డకు జన్మ నివ్వడంతో తన కుమారుడికి 'భరత్' అని పేరు పెట్టారు. 


జోధ్‌పూర్‌లోని తన సోదరుడిని కలవడానికి లాగ్యా వచ్చింది, కానీ స్వదేశానికి వెళ్లలేక పోయింది. పాకిస్థానీ రేంజర్లు వారిని అనుమతించక పోవడంతో వారు ప్రస్తుతం అట్టారీ సరిహద్దులో ఒక టెంట్‌లో నివసిస్తున్నారు.పాక్ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో విడిది చేశారు. వీరికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు.


Updated Date - 2021-12-06T13:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising