ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kolar: 20 కోతులకు విషమిచ్చి చంపి, గన్నీ బ్యాగుల్లో వేసి డంప్ చేశారు...

ABN, First Publish Date - 2021-09-30T17:17:21+05:30

దేశంలో జంతు హింసకు తెరపడటం లేదు...మానవత్వాన్ని మరిచిన కొందరు నరరూప రాక్షసులు 20 కోతులకు విషమిచ్చి చంపి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలార్ (కర్ణాటక): దేశంలో జంతు హింసకు తెరపడటం లేదు...మానవత్వాన్ని మరిచిన కొందరు నరరూప రాక్షసులు 20 కోతులకు విషమిచ్చి చంపి, వాటిని గన్నీబ్యాగుల్లో నింపి రోడ్డుపక్కన అడవుల్లో డంప్ చేసిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో తాజాగా వెలుగుచూసింది. కోతుల కళేబరాలను చూసిన అటవీశాఖాధికారులు వీటికి పోస్టుమార్టం చేయించి, నిందితులను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది జులై నెలలో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఓ గ్రామంలో 30 కోతులను గుర్తుతెలియని దుండగులు చంపారు.


ఈ ఘటన మరవక ముందే బేలూరు తాలాకా చౌదనహళ్లి గ్రామం వద్ద 20కోతులకు విషమిచ్చి చంపారు.దుండగులు కోతులకు విషమిచ్చి చంపి వాటి కళేబరాలను గన్నీబ్యాగుల్లో నింపి చౌడేనహళ్లి సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. గన్నీబ్యాగులు పడేసిన ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు వాటిని తెరచి చూడగా మరణించిన కోతులు కనిపించాయి. కోతుల మృతి ఘటనపై దాఖలైన పిటిషనుతో కర్ణాటక హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. జిల్లా పరిపాలన, అటవీశాఖ, జంతు సంక్షేమబోర్డు అధికారులను ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టు కేసు విచారిస్తోంది. 


Updated Date - 2021-09-30T17:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising