ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నల్లని బిస్కెట్‌తో చేసే ఈ అద్భుత వంటకం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. మరి తింటే...

ABN, First Publish Date - 2021-11-14T15:17:50+05:30

రెండు నిముషాల్లో తయారయ్యే అల్పాహారంగా మ్యాగీ పేరొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నిముషాల్లో తయారయ్యే అల్పాహారంగా మ్యాగీ పేరొందింది. దీనితో చేసే రకరకాల వంటకాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. కొందరు ఇటువంటి వంటకాలను మెచ్చుకుంటుండగా, మరికొందరు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో ఓరియో బిస్కెట్ చేరింది. చాలామంది ఇప్పుడు ఓరియో బిస్కెట్లతో రకరకాల వంటకాలు చేస్తున్నారు. చూడటానికి నల్లగా కనిపించే ఈ బిస్కెట్ రుచిపరంగా చిన్నారుల ఫేవరెట్‌గా మారింది. ఇదిలావుంటే చల్లని వాతావరణంలో చాలామందికి పకోడీలు తీనాలనిపిస్తుంది. ఉల్లి పకోడీలు మొదలుకొని, రరకాల పకోడీలు ఆహార ప్రియుల చేత లొట్టలు వేయిస్తుంటాయి. ఈ పకోడీలకు సంబంధించిన ఒక వంటకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేదో మిర్చి పకోడీనో లేక పన్నీర్ పకోడీనో కాదు.. 




ఓరియో పకోడీ.. వినగానే ఇదేంటిది.. అనుకున్నారా.. అవును ఇది నిజం.. మ్యాగీ వంటకాల మాదిరిగానో ఇప్పుడు ఓరియో వంటకాల వెరైటీలు ఎక్కువైపోయాయి. ఓరియో బిస్కెట్.. చాక్లెట్ బిస్కెట్‌గా పేరొందింది. ఇప్పటి వరకూ ఓరియో కేక్, షేక్‌ల వంతు అయ్యింది. ఇప్పుడు ఓరియో పకోడీల వంతు వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక హోటల్ బండీ నిర్వాహకుడు ఈ ఓరియో పకోడీలు చేసి చర్చల్లో నిలిచాడు. ఈ యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్నదాని ప్రకారం దుకాణదారు ముందుగా శనగ పిండిలో తగినంత ఉప్పువేసి బాగా కలిపి పకోడీలు వేసేందుకు సిద్ధం చేశాడు. ఆ తరువాత ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తెరిచి, ఆ బిస్కెట్లను శనగ పిండిలో ముంచి వాటితో పకోడీలు వేశాడు. అయితే ఈ ఓరియో పకోడీలను చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ పకోడీలను సిద్ధం చేశాక వాటిని దుకాణదారు టమోటా సాస్‌తో పాటు వినియోగదారులకు అందించాడు. ఈ వంటకాన్ని చూసిన ఆహార ప్రియులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

                                               Foodie Incarnate సౌజన్యంతో..

Updated Date - 2021-11-14T15:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising