ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క రాత్రి ఖర్చు అరకోటిపైనే!

ABN, First Publish Date - 2021-01-24T15:44:34+05:30

ఆంక్షలు సడలించాక సెలెబ్రిటీలు, మిలియనీర్లు మాల్దీవుల్లో సేదదీరేందుకు పరుగులు తీస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంక్షలు సడలించాక సెలెబ్రిటీలు, మిలియనీర్లు మాల్దీవుల్లో సేదదీరేందుకు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు మాల్దీవుల్లో కొత్త ఐలాండ్‌ని సిద్ధం చేసి మొన్ననే ఓపెన్‌ చేశారు. ఆ ఐలాండ్‌ పేరు ‘ఇతాఫుషి’. సముద్రం మధ్యలో ఉన్న ఈ అందాల దీవిలో త్రీబెడ్‌రూమ్‌ విల్లా, టూ బెడ్‌రూమ్‌ విల్లా అలాగే ఫోర్‌ బెడ్‌రూమ్‌ విల్లాలు ఉన్నాయి. అయిదు స్విమ్మింగ్‌ ఫూల్‌లు కూడా కొలువుదీరాయి. పచ్చని చెట్లు, చవులూరించేలా రకరకాలా ఆహార పదార్థాలను సిద్దం చేసే చెఫ్‌లు, వినోదం పంచేందుకు క్లబ్‌హౌస్‌, పిల్లల ప్లేజోన్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, డైవింగ్‌, పడవ ప్రయాణాలు, చుట్టూ నీలి సముద్రం... చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఆస్ట్రేలియన్‌, జపనీస్‌, ఇండియన్‌, చైనీస్‌ ఇలా చాలా రకాల వంటకాలు అక్కడ లభిస్తాయి. 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఇది మాల్దీవుల్లో ఉన్న అతి పెద్ద ప్రైవేటు దీవి. దీన్ని చేరుకోవాలంటే మాల్దీవుల నుంచి 40 నిమిషాల పడవ ప్రయాణం, 15 నిమిషాల విమాన ప్రయాణం అవసరం. ఆ దీవిలో ఒక్కరాత్రి ఉండాలంటే రూ.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-01-24T15:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising