ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజర్ కుక్కర్‌లో ఇరుక్కున్న బాలుడి తల.... వైద్యుల ‘ఇంజినీరింగ్’ చికిత్సతో విముక్తి!

ABN, First Publish Date - 2021-08-29T17:57:44+05:30

ఉత్తరప్రదేశ్‌లో ఏడాదిన్నర చిన్నారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో ఏడాదిన్నర చిన్నారి తన వింతచేష్టలతో ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుకుంటున్న బాలుడు షడన్‌గా తన తన తలను ప్రజర్ కుక్కర్‌లోకి దూర్చాడు. తిరిగి తన తలను కుక్కర్‌లో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. 


పిల్లాడిని గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు... ఆ కుక్కర్‌లో నుంచి పిల్లాడి తలను బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పిల్లాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్య బృందం కొంతమంది టెక్నీషియన్లను పిలిపించి వారి సాయంతో రెండు గంటపాటు శ్రమించి, కుక్కర్ నుంచి ఆ బాలునికి విముక్తి కల్పించారు. మధురలోని సుమాయల్ కుమారుడు హసన్ రాజ్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. బాధితుని కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు ఉచితంగా చికిత్స అందించారు.  


Updated Date - 2021-08-29T17:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising