ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత సమాధులు తవ్వి కరోనా శవాల ఖననం

ABN, First Publish Date - 2021-05-14T12:12:19+05:30

అలీఘడ్ ముస్లిమ్ విద్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎంయూలో కరోనా మరణమృదంగం...

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): అలీఘడ్ ముస్లిమ్ విద్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అలీఘడ్ ముస్లిమ్ విద్యాలయం(ఏఎంయూ)లో గత కొన్ని వారాల్లో కరోనా వైరస్ తో 35 మంది అధ్యాపకులు మరణించారు. కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు అలీఘడ్ శ్మశానవాటికలో ఖాళీ లేకపోవడంతో పాత సమాధులను తవ్వి అక్కడే పూడ్చి పెట్టాల్సి వస్తోంది. పాత సమాధులు తవ్వినపుడు ఎముకలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. ‘‘ప్రతీరోజూ 10 మృతదేహాల ఖననం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి నేనెన్నడూ చూడలేదు’’ అని స్థానిక వాసి నదీమ్ చెప్పారు. గత వారంలో ఏఎంయూలో సీనియర్ ప్రొఫెసర్లు కరోనాతో మరణించడంతో అలీఘడ్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 


‘‘గత 20 రోజుల్లో 16 మంది సభ్యులు మరణించారు, ఔషధ విభాగం ఛైర్మన్, లా ఫ్యాకల్టీ డీన్, ప్రముఖ అధ్యాపకులను కోల్పోయాం, దీంతో క్యాంపస్ లో భయం నెలకొంది’’ అని ప్రొక్టర్ ప్రొఫెసర్ ముహమ్మద్ వసీమ్ అలీ చెప్పారు. యూనివర్శిటీలో కరోనా మరణాలపై జన్యుశ్రేణి ద్వారా అధ్యయనం చేయాలని వైస్ ఛాన్సలర్ తారిక్ మన్సూర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కు లేఖ రాశారు.అలీఘడ్ జిల్లాలో 19,179 కరోనా కేసులు, నమోదు కాగా మరణాల రేటు గణనీయంగా పెరిగింది. కరోనా మరణాలతో విశ్వవిద్యాలయంలో కొవిడ్ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

Updated Date - 2021-05-14T12:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising